Site icon Prime9

Nayanthara: డాక్యుమెంటరిగా నయనతార జీవితం – ట్రైలర్‌ చూశారా?

Nayanthara: Beyond the Fairy Tale Trailer:  ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్.. సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార జీవితాన్ని డాక్యూమెంటరిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ డాక్యుమెంటరికి సంబంధించిన పోస్టర్‌ రిలీజ్‌ చేసి అధికారిక ప్రకటన ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్‌. తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తూ డాక్యూమెంటరి రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది. ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిర్‌ టేల్‌’ పేరుతో ఈ డాక్యుమెంటరీని తీశారు. ఇందులో నయన్ తన జీవితంలో ఎదురై చేదు అనుభవాలు, సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ గురించి స్వయంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు తన భర్త, డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌తో ప్రేమ, పెళ్లిపై స్పందిస్తూ ఎమోషనల్‌ అయ్యింది.

ట్రైలర్‌లో ఏముందంటే..

ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఈ డాక్యూమెంటరికి దర్శకత్వం వహించారు. నవంబర్‌ 18 న నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఇది స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ చేసింది నెట్‌ఫ్లిక్స్‌. లేడీ సూపర్‌ స్టార్‌, లేడీ సూపర్‌ స్టార్‌ అంటూ బ్యాగ్రౌండ్‌లో వస్తుండగా.. తన సినిమాల్లో పవర్ఫుల్‌ రోల్స్‌ లుక్స్ చూపించారు. ఆ తర్వాత కన్నడ హీరో ఉపేంద్ర నయన్‌ గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఆమెను లేడీ సూపర్‌ స్టార్ అని పిలుస్తారని ఆయన చెప్పడం.. ఆ తర్వాత డైరెక్టర్‌ అట్లీ కూడా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార అంటూ ఆమెను కొనియాడారు.

ఆ తర్వాత తాప్సీ, రానా, రాధిక శరత్‌కుమార్‌ నాగార్జున అక్కినేని అన్ని ఇండస్ట్రీలకు చెందని అగ్ర నటీనటులు ఆమె గురించి మాట్లాడారు. “ఒక ఫీమేల్‌ యాక్టర్‌ కోసం పుస్తకాల్లో రాసిన రూల్స్‌ అన్ని తప్పు అని ఆమె నిరూపించింది” అంటూ తాప్సీ చెప్పడం ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున ఆమె రిలేషన్‌ షిప్స్‌ గురించి ప్రస్తావించారు. “ఆ సమయంలో ఆమె గందరగోళమైన రిలేషిప్‌లో వెళుతుంది అని భావించాను” అంటూ చెప్పడం ఆసక్తిని కలిగిస్తుంది. ఆ తర్వాత నయన్‌ తన జీవితం గురించి చెప్పిన కొన్ని ఆసక్తికర కామెంట్స్‌ని ట్రైలర్‌లో చూపించారు. “చాలా మనుషులను త్వరగా నమ్మేస్తాను. నా గురించి అసలేం తెలియకుండానే వార్తలు రాశారు. ఆ సమయంలో అవి చూసి మా అమ్మ భయపడింది” అంటూ నయన్‌ ఎమోషనల్‌ అయ్యింది.

ఆ తర్వాత నయన్‌ తల్లి మాట్లాడుతూ నా కూతురు ఏంటో నాకు తెలుసు అని చెప్పారు. ఆ తర్వాత తన జీవితాన్ని నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరిగా తీసుకురావడానికి కారణమేంటని అడగ్గా.. నేనేప్పుడు పక్కవారు హ్యాపీగా ఉండాలని అనుకుంటాను. అలాగే అందరు కూడా ఇతరుల హ్యాపీనెస్‌ చూసి వారు కూడా హ్యాపీగా ఫీలవ్వాలని అనుకుంటా. అందుకే డాక్యుమెంటరీ తీయడానికి ఒప్పుకున్నాను అని చెప్పుకొచ్చింది. ఇక ట్రైలర్‌ చివరిలో విఘ్నేశ్‌ శివన్‌ నయన్‌తో పెళ్లిపై స్పందించారు. తానేప్పుడు పెద్దపెద్ద పెళ్లి, ఫంక్షన్స్‌కి వెళ్లలేదు, చూడలేదన్నాడు. కానీ నయన్‌తో పెళ్లిని చాలా గ్రాండ్‌ జరిగింది. నయన్‌ నా లైఫ్‌లోకి రావడం ఓ అద్భుతం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నయతార డాక్యుమెంటరి ట్రైలర్‌ బాగా ఆకట్టుకుంటుంది.

Exit mobile version