Nellore YCP: ఫోన్ ట్యాపరింగ్ ఆరోపణలు: కోటంరెడ్డి ఔట్.. బరిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి

Nellore YCP: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద దుమారమే లేపుతోంది.

సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభుత్వం ట్యాంపరింగ్ చేస్తోందని కోటంరెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఆరోపించిన విషయం తెలిసిందే .

తన ఫోన్ ట్యాంపింగ్ చేశారని.. అందుకు తగ్గ సాక్ష్యాలు సైతం ఆయన బయటపెట్టారు.

చంపేందుకు కుట్ర: ఆనం

మరో వైపు తన ఫోన్ లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు.

నెల్లూరు మాఫియా ఆగడాలను ప్రశ్నించినందుకు తన ఫోన్లు ట్యాంపింగి లో ఉన్నాయన్నారు.

తన కదలికలను పరిశీలిస్తూ.. తనను లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

తనకు భద్రత తొలగించడంపై పార్టీ అధిష్టానమే సమాధానం చెప్పాలన్నారు.

 

వచ్చే ఎన్నికల్లో ఆదాల పోెటీ (Nellore YCP)

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో నెల్లూరు రూరల్ ఇన్ చార్జి బాధ్యతల (Nellore YCP) నుంచి కోటంరెడ్డిని తప్పించింది వైఎస్సార్సీపీ.

ఇంచార్జి నియామకం కోసం పలువురు నేతలను పరిశీలించారు. కానీ చివరకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి అదిష్టానం నియమించింది.

సీఎంను కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

పార్టీ తాజా ప్రకటనతో జిల్లా రాజకీయల్లో కలకలం రేపుతోంది.

 

కోటం రెడ్డి పై చర్యలు

ప్రభుత్వమే ఫోన్ ట్యాపరింగ్ చేస్తోందని కోటంరెడ్డి ఆరోపిస్తున్నారని.. ఆయనపై చర్యల తీసుకునే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఫోన్ ట్యాపరింగ్ జరిగినట్టు కోటంరెడ్డి, ఆనం నిరూపించాలని సవాల్ విసిరారు. రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే.. అప్పటి నుంచి ఎందుకు మాట్లాడలేదన్నారు.

కోటం రెడ్డి ఫోన్ కాల్ ను తన ఫ్రెంఢ్ రికార్డు చేశారని తెలిపారు. ఫోన్ రికార్డింగ్ ని ట్యాపింగ్ అంటున్నారన్నారు.

 

మరో వైపు పార్టీలో అసంతృప్తి, విభేదాల నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

నేతల మధ్య విబేధాలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సీనియర్ నాయకులను ఆదేశించారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/