Nayanthara in Prabhas The Raja Saab: ప్రభాస్ హీరో దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కానీ షూటింగ్ ఎంతవరకు వచ్చిందనేది మాత్రం క్లారిటీ లేదు. రాజాసాబ్ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మూవీ టీం ప్రకటించింది. ఈ క్రమంలో షూటింగ్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు మారుతి. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ కాస్తా ఏజ్డ్‌గా కనిపించాడు. రాజుగా సింహాసనంపై కూర్చుని సిగర్ తాగుతూ రాయల్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్ మూవీపై అంచనాలను మరింత రెట్టింపు చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇందులో మారుతి ఓ స్పెషల్ సాంగ్ డిజైన్ చేశాడట. అది మూవీకి మరింత హైలెట్ కానుందట. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా లేడీ సూపర్‌స్టార్‌నే రంగంలోకి దింపుతున్నాడట. ఆ నటి ఎవరో కాదు ప్రస్తుతం ధనుష్‌తో వివాదంలో వార్తల్లో నిలుస్తున్న బ్యూటీ నయనతార. అవును రాజాసాబ్‌లోని స్పెషల్ సాంగ్ కోసం మూవీ టీం నయనతార పేరు పరిశీలిస్తున్నారట. త్వరలోనే ఆమె కలిసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు, ఇప్పటికే ఆమె కలిసి ఒప్పించనట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయట. మరి ఈ స్పెషల్ సాంగ్‌కు ఆమె ఒప్పుకుంటుందా? లేదా? అనేది ఆసక్తి మారింది.
ఎందుకంటే కెరీర్ ప్రారంభంలో నయన్ స్పెషల్ సాంగ్స్, అతిథి పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపించేది. కానీ, లేడీ సూపర్ స్టార్ అనే గుర్తింపు వచ్చినప్పటి నుంచి ఫుల్‌లెన్త్ రోల్స్ మాత్రమే ఎంచుకుంటుంది. మరి రాజాసాబ్ కోసం నయన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? లేదా? చూడాలి. కానీ ప్రభాస్ రాజాసాబ్‌లో నయనతార స్పెషల్ సాంగ్ అంటూ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది బయటకు వచ్చినప్పటి నుంచి మూవీ విపరీతమైన బజ్ నెలకొంది. ఎప్పుడో యోగిలో వీరద్దరిని తెరపై చూశామని, మళ్లీ ఇన్నేళ్లకు ఈ జోడి తెరపై సందడి చేయబోతుందంటూ వారి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చేసిన ఈ వార్తే ట్రెండ్ అవుతుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
కాగా రాజాసాబ్ మూవీ హారర్ డ్రామా రూపొందిస్తున్నాడు మారుతి. తన కెరీర్‌లో ఫస్ట్‌టైం ఈ సినిమా కోసం మారుతి గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌ని టచ్ చేశాడట. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌పై ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాతో ఆడియన్స్‌ని విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటిదాకా టాలీవుడ్‌లోనే కాదు ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పుడూ చూడనంత గ్రాండియర్‌గా రాజాసాబ్ విజువల్ ట్రీట్ ఇస్తుందని నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పటి నుంచి ఈ సినిమా అంచనాలు మరింత నెలకొన్నాయి. కాగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.