Site icon Prime9

Nara Lokesh : యువగళం పాదయాత్ర కోసం రెడీ అవుతున్న నారా లోకేష్.. వారితో మీటింగ్?

nara lokesh video conference with tdp leaders about yuvagalam padayatra

nara lokesh video conference with tdp leaders about yuvagalam padayatra

Nara Lokesh : తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమావేశంలో తెదేపా పోలిట్ బ్యూరో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, బీసీ సాధికార సమితి సభ్యులు,
అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు.

“యువ గళం” నిర్వహణ పై నారా లోకేష్ (Nara Lokesh) చర్చ..

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. మూడున్నర ఏళ్లుగా మనం ఒక సైకో పై పోరాడుతున్నాం.

తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు.

కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు… గతంలో ఎప్పుడూ ఇంత సైకో పాలన చూడలేదు.

ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కార్యకర్తలు, నాయకుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులు పెట్టి వేధించారు.

అయినా మీరు ఎక్కడా తగ్గలేదు పోరాడారు. టిడిపి కి బలం కార్యకర్తలు, నాయకులే.

మనం అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి లా చేసుంటే వైసిపి ఉండేది కాదు. ఆ పార్టీ నాయకులంతా ఇతర దేశాలకు పారిపోయేవారు.

కానీ మన వాళ్ళు అలా కాదు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఎం పీకుతావో పీకు అని తొడకొట్టారు.

పసుపు జెండా కోసం ప్రాణం ఇచ్చే బ్యాచ్ మనది.

ప్రజలంతా ఎన్నో ఆశలతో జగన్ రెడ్డి కి ఒక్క ఛాన్స్ ఇచ్చారు.

కానీ ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు.

151 సీట్లు ప్రజలు ఇచ్చినందుకు ఎన్నో గొప్ప పనులు చెయ్యొచ్చు.

కానీ జగన్ రెడ్డి కేవలం కక్ష సాధింపు కోసమే అధికారాన్ని వాడుకున్నారు.

ఏ వర్గం సంతోషంగా లేరు. జగన్ రెడ్డి పై ప్రజల్లో ద్వేషం కనిపిస్తుంది.

మహిళలు, రైతులు, యువత, ఉద్యోగస్తులు ఆఖరికి పోలీసులు కూడా వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు.

జగన్ రెడ్డి దోపిడీ విచ్చలవిడిగా పెరిగిపోయింది.

లిక్కర్, సాండ్, మైనింగ్ మాఫియాలతో రాష్ట్రాన్ని, ప్రజల్ని దోచుకుంటున్నారు.

ప్రజల పై భారాన్ని విపరీతంగా పెంచారు. కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారు.

విచిత్రం ఏంటంటే పేద వాడికి అన్నం పెట్టే అన్న క్యాంటిన్ ఎత్తేసాడు. మనం పేదలకు భోజనం పెడతాం అంటే పెట్టనివ్వడు.

వైసిపి నాయకుల్లో, కార్యకర్తల్లో జగన్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది.

అందుకే ఈ మధ్య మంత్రులు. ఎమ్మెల్యేలు, నాయకులు జగన్ రెడ్డి చెత్త పరిపాలన గురించి విమర్శిస్తున్నారు.

వార్ ఒన్ సైడ్ అయిపొయింది. ప్రజలంతా మన వైపు ఉన్నారు.

 

సైకో పోవాలి.. సైకిల్ పాలన రావాలి: నారా లోకేష్ (Nara Lokesh)

దీని కోసం మనం అంతా ఇంకా ప్రజలకు మరింత దగ్గర అవ్వాల్సిన అవసరం ఉంది.

ఇప్పటికే మనం బాదుడే బాదుడు… ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాం.

మీ అందరికి ఆశీస్సులతో త్వరలో నేను యువగళం పాదయాత్ర చేపట్టబోతున్నాను.

యువత ని జగన్ మోసం చేసాడు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి మోసం చేసాడు.

విదేశీ విద్య పధకం రద్దు చేసాడు. ఉన్న కంపెనీలను తరిమేసాడు. కొత్త కంపెనీలు రావడం లేదు.

ఈ నేపథ్యంలో నేను ప్రజా సమస్యల పై పోరాటం చేసేందుకు యాత్ర చేస్తున్నాను.

అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుంటాను. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా పోరాడతాను.

ప్రభుత్వం స్పందించకుంటే టిడిపి ప్రభుత్వం వచ్చిన వేంటనే సమస్యలు పరిష్కరిస్తాం.

400 రోజులు, 4 వేల కిలోమీటర్ల మేర నా పాదయాత్ర సాగుతుంది. మీ సూచనలు, మీ మద్దతు నాకు కావాలి.

మన దేవుడు ఎన్టీఆర్ గారి ఆశయాలను, మన రాముడు చంద్రబాబు గారి విజన్ ని ముందుకు తీసుకెళ్లేందుకు యువగళం మంచి వేదిక కాబోతుంది అని లోకేష్ మాట్లాడారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version