Site icon Prime9

Nara Lokesh Yuvagalam Day 1 : పవన్ కళ్యాణ్ వారాహి ఆగదు, అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోతాం – నారా లోకేష్ మాస్ వార్నింగ్

Nara Lokesh comments about pawan kalyan varahi in Yuvagalam Day 1

Nara Lokesh comments about pawan kalyan varahi in Yuvagalam Day 1

Nara Lokesh Yuvagalam Day 1 : పవన్ కళ్యాణ్ వారాహిని, తన యువగళాన్ని ఎవరూ ఆపలేరని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. 

ఎవరైనా అడ్డు వస్తే తొక్కుకుంటూ వెళ్లిపోతాం అని సవాల్ చేశారు.

400 రోజుల పాటు  4వేల కిలోమీటర్లు మేర చేపట్టనున్న యువగళం పాదయాత్రను ఇవాళ ఉదయం కుప్పం నుంచి లోకేశ్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అభివృద్ధి చేశాను.

ఐటీ మంత్రిగా.. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. ఆ అర్హతతోనే పాదయాత్ర చేస్తున్నా.

నన్ను విమర్శించే మంత్రులను ప్రశ్నిస్తున్నా.. ఈ మూడేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు. . వీధుల్లో డ్యాన్సులు వేస్తే, క్యాసినో ఆడిస్తేనో పరిశ్రమలురావు అని అన్నారు.    

ఈ  మూడేళ్లలో రాష్ట్రాన్ని 67ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. 3 రాజధానుల్లో ఎక్కడైనా ఒక్క ఇటుకైనా వేశారా జాదూరెడ్డి? పారిశ్రామిక వేత్తలు పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి.

జే ట్యాక్స్‌ కట్టలేదని పక్క రాష్ట్రానికి పంపించేశారు. మహిళలపై దాడులు జరిగితే గన్‌ కంటే ముందు జగన్‌ వస్తాడని ప్రగల్భాలు పలికారు.

కానీ, అది బుల్లెట్లు లేని గన్‌ అని ప్రజలకు అర్థమైంది’’ అని లోకేశ్‌ విమర్శించారు.

“చంద్రబాబు కుప్పంలో మెడికల్ కాలేజీ తీసుకువచ్చారు. ఇంజినీరింగ్ కాలేజీలు తీసుకువచ్చారు.
డిగ్రీ కాలేజీ తీసుకువచ్చారు. ద్రవిడ వర్సిటీ తీసుకువచ్చారు. పాఠశాలలు తీసుకువచ్చారు.
ఏ రోడ్డయినా తీసుకోండి… దానిపై చంద్రబాబు పేరుంటుంది. నియోజకవర్గంలో చెక్ డ్యాములు కట్టారు.
పరిశ్రమలు తీసుకువచ్చి 20 వేల మందికి ఉపాధి కల్పించారు.
పేద ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు రూ.2లకే ఎన్టీఆర్ సుజల పథకం తీసుకువచ్చారు.

నువ్వు అమూల్ పాలు తాగే సమయంలోనే చంద్రబాబు కుప్పం అభివృద్ది చేశారు .. నారా లోకేష్

అయ్యా జగన్ రెడ్డీ… నువ్వు అమూల్ పాలు తాగే సమయంలోనే చంద్రబాబు ఇజ్రాయెల్ టెక్నాలజీతో కుప్పంలో డ్రిప్ ఇరిగేషన్ తీసుకువచ్చారు.
రూ.613 కోట్లతో హంద్రీనీవా పనులు 90 శాతం పూర్తి చేస్తే.. ఈ మూడున్నరేళ్లలో మిగిలిన 10 శాతం పూర్తిచేయలేకపోయారు.
పేదలకు రూ.100 కోట్లతో హౌసింగ్ ప్రాజెక్టు ప్రారంభిస్తే ఈ సైకో ఆపేశాడు. మోడల్ కాలనీ, రింగురోడ్డు పనులు ప్రారంభిస్తే ఈ సైకో ముఖ్యమంత్రి అయ్యాక ఆపేశాడు.
ఈ సైకో ముఖ్యమంత్రి అయ్యాక కుప్పానికి ఆర్టీసీ బస్సులు తగ్గించాడు.
మీరా కుప్పంలో గెలిచేది? కుప్పంపై మీకు చిత్తశుద్ధి ఉంటే రూ.1300 కోట్ల పనులు పూర్తిచేయండి… అప్పుడు వచ్చి కుప్పంలో ఓట్లు అడగండి” అని స్పష్టం చేశారు.
త్వరలోనే యువతకు ప్రత్యేకంగా మేనిఫెస్టో తీసుకు రాబోతున్నాం.
ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? ప్రైవేటు రంగం నుంచి ఎన్ని? స్వయం ఉపాధి ద్వారా ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో స్పష్టంగా అందులో ప్రకటిస్తాం.
ఏటా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తాం. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని హామీ ఇచ్చారు.
లోకేష్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. మొదటి రోజే లోకేష్ ఈ రేంజ్ లో కౌంటర్లు ఇవ్వడం పట్ల వైకాపా నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version