Site icon Prime9

Dasara Teaser: నీ యవ్వ.. ఎట్లైతే గట్లే సూస్కుందామ్‌.. అదిరిపోయిన నాని ‘దసరా’ టీజర్

dasara teaser

dasara teaser

Dasara Teaser: నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’ ఈ చిత్ర టీజర్ నేడు విడుదలైంది. ఇప్పటికై ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో ఈ సినిమా టీజర్ ను రాజమౌళి విడుదల చేశారు. తమిళంలో ధనుష్.. హిందీలో షాహిద్ కపూర్.. మళయాళంలో దుల్కర్.. కన్నడలో రక్షిత్ శేట్టి ఏకకాలంలో విడుదల చేశారు.

ఊరమాస్‌గా నాని దసరా టీజర్‌..

ఈ సినిమా టీజర్ లో నాని ఊర మాస్ లుక్కులో కనిపించారు. ఈ టీజర్ (Dasara Teaser) నాని వాయిస్ తో ప్రారంభం అవుతుంది.

ఈర్లపల్లి చుట్టూర బొగ్గు కుప్పలు.. మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం అంటూ నాని చెప్పే పల్లెటూరి మాస్‌ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో నాని Nani పూర్తిగా రస్టిక్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో నాని చెప్పే మరో డైలాగ్ అభిమానులకు ఆకట్టుకుంటుంది.

నీయవ్వ.. ఎట్టైతె గట్లాయే గుండు గుత్తగా లేపేద్దాం.. అనే డైలాగ్ ని ఇరగదీశాడు. బొగ్గుగని బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనుంది.

ఇటు మాస్ తో పాటు.. వినోదాన్ని అందించేలా ఈ సినిమా ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో కిర్తీ సురేష్ నాయిక పాత్రలో నటిస్తుంది.

నటనలో ఇరగదీసిన నాని

ఇక టీజర్ చివర్లో నాని నటన పీక్స్.. నోట్లో కత్తి పెట్టుకుని వేలితో రక్తపు బొట్టు పెట్టుకోవడంతోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అర్ధం అవుతుంది.

టీజర్ శాంపిల్ మాత్రమే అని.. నాని నటనతో విశ్వరూపం చూపిస్తాడని అభిమానులు అంటున్నారు.

నానికి జంటగా.. కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాకు  శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని తెలంగాణ యువకుడి పాత్రలో నటిస్తున్నాడు.

సింగరేణి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమాలో సాయికుమార్, స‌ముద్రఖని, జ‌రీనా వ‌హ‌బ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు.

ఈ సినిమా పలు భాషల్లో మార్చి 30న విడుదల కానుంది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version