Site icon Prime9

Nagarjuna: చై-శోభిత ఒక్కటైన ఈ క్షణం నాకేంతో ప్రత్యేకం – నాగార్జున ఎమోషనల్‌ పోస్ట్‌

Nagarjuna Shared Chay-Sobhita Wedding Pics: నాగచైతన్య-శోభితలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితలు సమక్షంలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి 8:15 గంటల శుభముహర్తనా చై, శోభిత మెడలో మూడుమూళ్లు వేశాడు. హిందు సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ ముచ్చటైన వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌, డైరెక్టర్‌ రాజమౌళి, కె రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌ వంటి సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

ఇక పెళ్లి అనంతరం నాగార్జున కొత్త జంట ఫోటోలను షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ అయ్యారు. శోభిత, చై ఒక్కటైన ఈ మధుర క్షణాలు చూస్తుంటే నా మనసు భావోద్వేగానికి లోనైంది. ఇద్దరు జంటగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఈ మూమెంట్‌ నాకేంతో ప్రత్యేకం. చై నీకు నా శుభకాంక్షలు అలాగే వెల్‌కమ్‌ టూ అక్కినేని ఫ్యామిలీ డియర్‌ శోభిత. ఇప్పటికే మా జీవితంలోకి నువ్వు ఎంతో సంతోషాన్ని తీసుకువచ్చావు.

ఏఎన్నార్‌ గారి శత జయంతి వేడుకలకు గుర్తుగా స్థాపించిన నాన్నగారి విగ్రహం ముందు చై-శోభితల పెళ్లి జరగడం ఎంతో లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ఈ ప్రయాణంలో అడుగడుగునా ఆయన ప్రేమ, మార్గదర్శకాలు మనతో ఉన్నట్టు అనిపిస్తుంది. మాపై కురిపించిన లేకలేనన్ని ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞతతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అంటూ నాగార్జున్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా నాగచైతన్య, శోభితల పెళ్లి ఫోటోలు షేర్‌ చేశారు. ఇందులో పెళ్లి కొడుకు, పెళ్లికూతురుగా చై-శోభితలు చూడ ముచ్చటగా కనిపించారు. పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట ఎంతో ఆనందంగా కనిపించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెటిజన్లు, అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Exit mobile version