Nagababu Tweet: ఓ ప్రముఖ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారంపై నాగబాబు స్పందించారు. తను చేసిన వ్యాఖ్యలను.. మరోలా మార్చి చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పొత్తులపై నాగబాబు ఇదివరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఓ మీడియా సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని నాగబాబు అన్నారు.
రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు.. పావులు కదుపుతున్నాయి. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో జనసేన ఇతర పార్టీలతో పొత్తు
పెట్టుకుంటుందని రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతుంది. దీనికి తోడు చంద్రబాబును పవన్ కలవడం మరింత బలాన్ని చేకూర్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయని అందరు అనుకుంటున్నారు.
నేను చెప్పింది ఏంటి..!
మీరు చెప్తోంది ఏంటి..?!Shame on You @NTVJustIn @NtvTeluguLive pic.twitter.com/yZlSYSBqVS
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 22, 2023
మరో వైపు పొత్తులు ఎవరితో ఉంటాయని నిర్ణయించేది జనసేన అధ్యక్షుడు పనవ్ కళ్యాణ్ మాత్రమేనని నాగబాబు అన్నారు.
దీనిపై ఇదివరకే ప్రకటన కూడా చేశారు. అయితే ఓ మీడియా సంస్థ మాత్రం.. వచ్చే ఎన్నికల్లో జనసేన 175 స్థానాల్లో ఒంటిరిగా పోటీ చేస్తుందని ప్రచారం చేస్తుంది.
దీనిపై స్పందించిన నాగబాబు (Nagababu ) ఆ మీడియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను పొత్తులపై ఎలాంటి ప్రకటన చేయలేదని.. అది పవన్ నిర్ణయమని నాగబాబు అన్నారు.
సదరు ఛానెల్ మాత్రం తానే ప్రకటన చేసినట్లు ప్రచారం చేయడం సరికాదని అన్నారు.
175 స్థానాల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని తానేక్కడ చెప్పలేదని వివరణ ఇచ్చారు.
ఇలాంటి అసత్య ప్రచారాలతో జనసైనికులకు అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇలాంటి మీడియా సంస్థలకు జన సైనికులు దూరంగా ఉండాలని నాగబాబు పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడమే తమ లక్ష్యమని నాగబాబు అన్నారు.
వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ చెప్పడం వెనకు వ్యూహం ఉందన్నారు.
ఆ వ్యూహం ఏంటో తర్వాత తెలుస్తుందన్నారు. పవన్ ఏం చేసిన అది రాష్ట్ర బాగుకోసమే అని నాగబాబు
స్పష్టం చేశారు.
పొత్తులపై ప్రకటన చేసే అంతిమ నిర్ణయం పవన్ దే అని నాగబాబు చెప్పారు.
దీనిపై ఎవరు ఎలాంటి ప్రకటన చేయాల్సిన అవసరం లేదన్నారు.
ఎవరితో పొత్తులు ఉంటాయన్న విషయం కోసం అందరం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం నాగబాబు పేర్కొన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/