Site icon Prime9

Naga Chaitanya: మరికొన్ని క్షణాల్లో శోభిత మెడలో మూడుమూళ్లు వేయనున్న చై.. ముహుర్త టైం ఎప్పుడో తెలుసా?

Naga Chaitanya Sobhita Marriage Details: అక్కినేని కుటుంబమంతా పెళ్లి సంబరాల్లో మునిగింది. ఇవాళ అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య, శోభిత వివాహం అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి రెండు కుటుంబాలు అన్నపూర్ణ స్టూడియోకు చేరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చై-శోభిత పెళ్లికి వేదికగా నిలిచిన అన్నపూర్ణ స్టూడియో అతిథులను ఆకట్టుకునేలా అందంగా ముస్తాభైంది.

పూర్తి సంప్రదాయ పద్దతిలో జరగనున్న ఈ పెళ్లికి సంబంధించిన క్రతువు ఇప్పటికే మొదలయ్యాయి. ఒక కొన్ని గంటల్లో వీరిద్దరు ఏడడుగుల బంధంలోకి అడుగులు వేయబోతున్నారు. ఇవాళ బుధవారం రాత్రి 8:15 నిమిషాలకు శోభిత మెడలో చై మూడుమూళ్లు వేయనున్నారు. కాగా గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసిన నాగచైతన్య-శోభిత పెళ్లి గురించే చర్చ జరుగుతుంది. అడంబరానికి పోకుండ పూర్తి సంప్రదాయా పద్దతిలో వీరి పెళ్లి వేడుక జరగనుంది. అంతేకాదు ఈ వేడుకకు కూడా కొద్దిమందికి మాత్రమే ఆహ్వానం అందింది. అయితే డిసెంబర్‌ 4న పెళ్లి తేదీ ఖరారైనట్టు అందరికి తెలుసు.

దీంతో ఈ వివాహ మహోత్సవంకు సంబంధించిన అంశాల విషయంలో గోప్యత పాటించారు. ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ బయటకు వచ్చిన అది క్షణాల్లో వైరల్‌ అవుతుంది. తాజాగా పెళ్లి ముహుర్తం బయటకు రావడం విశేషంగా మారింది. ఇక ఈపెళ్లి అల్లు అర్జున్‌ సతీసమేతంగా హాజరు కానున్నాడట. అలాగే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, చిరంజీవి వంటి టాలీవుడ్‌ ప్రముఖులు పెళ్లికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించనున్నారు. కాగా సమంతతో విడాకుల తర్వాత చై శోభితకు దగ్గరయ్యాడు.

ఆమె సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో వీరిద్దరు విదేశాలకు వెకేషన్‌ వెళ్లిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కానీ ఎప్పుడు కూడా వీరు తమ రిలేషన్‌పై స్పందించలేదు. రీసెంట్‌గా కూడా జర్మనీలో జంటగా కనిపించిన ఫోటోలు బాగా వైరల్‌గా అయ్యాయి. నాగచైతన్య-శోభితల రిలేషన్‌ హట్‌టాపిక్‌గా ఉన్న క్రమంలోనే నిశ్చితార్థం చేసుకుని అందరికి షాకిచ్చారు. ఈ ఏడాది ఆగష్టు 8న గుట్టుచప్పుడు కాకుండా ఈ జంట రింగులు మార్చుకున్నారు. అనంతరం నాగార్జున ఎంగేజ్‌మెంట్ ఫోటోలు రిలీజ్‌చేసి అధికారిక ప్రకటన ఇచ్చారు. నేడు పెళ్లితో తమ బంధాన్ని ఆఫీషియల్‌ చేసుకోబోతున్నారు ఈ లవ్‌బర్డ్స్.

Exit mobile version