Site icon Prime9

Naga Chaitanya : “తండేల్” గా రాబోతున్న అక్కినేని నాగ చైతన్య.. ఊర మాస్ లుక్ లో అదరగొట్టాడుగా !

naga chaitanya new movie title announced

naga chaitanya new movie title announced

Naga Chaitanya : టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య.. తన 23వ సినిమాని గీతాఆర్ట్స్ లో బ్యానర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించి న్యూ  అప్డేట్ ఇచ్చారు , ఈ మూవీ టైటిల్ ని ఆడియన్స్ కోసం ప్రకటించడం జరిగింది .చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. నాగ చేతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న రెండోవ సినిమా ఇది .2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది సమాచారం.

ఇక ఈ సినిమా కోసం నాగ్ చైతన్య జిమ్ లో కసరత్తులు కూడా చేసి బాడీ పెంచుతున్నాడు. 2018లో గుజరాత్ నుండి 21 మంది మత్స్యకారులు వేటకెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్‌ చెరలో చిక్కుకోగా అందులో ఉన్న ఓ ఆంద్ర మత్స్యకారుడు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు ఇటీవల నిర్మాతలు తెలిపారు. ఇక ఈ సినిమాలో నాగ్ చైతన్య సిక్స్ ప్యాక్ కూడా చూపించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతుందని ప్రకటించిన తర్వాత సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. చెరలో చిక్కుకున్న మత్స్యకారుడికి ప్రేయసి అంటే కొంచం కొత్తగానే ఉంది మరి ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి .

ఇటీవల ఈ సినిమా రీసెర్చ్ కోసం నాగ చైతన్య శ్రీకాకుళంలో మత్స్యకారులతో సముద్రమలోకి కూడా వెళ్ళొచ్చాడు. తాజాగా నాగచైతన్య 23వ సినిమా టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమాకు ‘తండేల్’ అనే టైటిల్ ని ప్రకటించారు. తండేల్ అంటే నాయకుడు, కెప్టెన్ అని అర్ధం వస్తుందని సమాచారం. దీంతో పాటు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చైతన్య సముద్రంలో పడవలో కూర్చొని సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఫుల్ గడ్డంతో, ఫుల్ జుట్టుతో మాస్ లుక్ లో ఉన్నాడు. దీంతో చైతు నుంచి మరో సరికొత్త కథఆడియన్స్ ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది.

 

 

Exit mobile version