Site icon Prime9

Naga Chaitanya : లాల్ సింగ్ చడ్డా ఫెయిల్యూర్ పై స్పందించిన నాగ చైతన్య.. వైరల్ కామెంట్స్ ఆన్ అమీర్ ఖాన్

naga-chaitanya comments on laal sing chedda movie

naga-chaitanya comments on laal sing chedda movie

Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం దూత సిరీస్ ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. ఆ తరువాత మరో సినిమా అయిన “తండేల్” అనే మూవీని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు . అయితే నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ధూత సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 1న స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా ధూత ప్రమోషన్లలో పాల్గొంటున్నారు చైతూ. ఈ క్రమంలో ధూత సిరీస్, మూవీ అప్డేట్స్ గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అలాగే అమిర్ ఖాన్, చైతూ కలిసి నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ఫెయిల్యూర్ పై స్పందించారు. ఈ సినిమాతోనే చైతూ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

అక్కినేని నాగ చైతన్య మొదటిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కేవలం వెండితెరపై సందడి చేసిన చైతూ.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాంపై జర్నలిస్ట్ పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. అదే ‘ధూత’. ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడం గురించి చైతూ మాట్లాడుతూ, “ఇది చాలా ఆకస్మాత్తుగా జరిగిందని నేను అనుకుంటున్నాను, లాక్డౌన్ సమయంలో ధూత స్టోరీ విన్నాను. విక్రమ్ నన్ను పిలిచి, ఓటీటీ కోసం ఒక ఆలోచన ఉందని చెప్పాడు. అదే సమయంలో నేను చాలా కంటెంట్‌ని వింటున్నాను. అలాగే ఒక నటుడిగా అన్నింటిని ప్రయత్నించాలని అనుకుంటున్నాను. ధూతలో 8 ఎపిసోడ్‌లు ఎలా ఉన్నాయి. ఇది నేను నిజంగా ప్రయత్నించాలనుకున్న ఫార్మాట్.” అని అన్నారు చైతూ.

అలాగే లాల్ సింగ్ చడ్డా ఫెయిల్యూర్ పై స్పందిస్తూ.. ” లాల్ సింగ్ చద్దా ఫెయిల్యూర్ కావడం నాకు భయం కాలేదు. మనం చేసే ప్రతి పని, ప్రతి ప్రాజెక్టుల రిజల్స్ ఏంటీ అనేది మనం నిర్ణయించలేము. ఫెయిల్యూర్స్ అనేవి మనకు కొంత పాఠాన్ని నేర్పుతాయి. కానీ ఇది నేను ఎదురుచూసే ప్రయాణం. ఆ చిత్రం సమయంలో అమీర్ సర్ తో ప్రయాణం నాకు వెలకట్టలేనిది. నేను దాని నుండి చాలా నేర్చుకున్నాను. అది ఒక నటుడిగా, మనిషిగా, అమీర్ ఖాన్ సర్ నుండి చాలా నేర్చుకున్నాను. బాలీవుడ్ అంటే నేనెప్పుడూ ఆసక్తిగా చూస్తాను, సినిమా ఫెయిల్యూర్ అయిన అంత మాత్రాన బాలీవుడ్ సినిమాలు చేయడం ఏమి ఆపను ,హిందీ చిత్రాలను మళ్లీ ప్రయత్నిస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు.

 

Exit mobile version