Site icon Prime9

Munugode: మునుగోడు నామినేషన్లపై ఉత్కంఠ.. నేడే ఆఖరి రోజు

Munugodu elections nominations ends today

Munugodu elections nominations ends today

Munugode: మునుగోడు ఉపన్నిక తెలంగాణ రాష్ట్రమంతా ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఎవరకి ఈ నియోజకవర్గ పట్టం కడతారానా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మునుగోడు బైపోల్ కు సంబంధించి నామినేషన్ల పర్వం తుదిదశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఇందులో గురువారం ఒక్కరోజే 24 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. చివరి రోజైన నేడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

ఈ నెల 15న ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈనెల 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. కాగా మరి మునుగోడు బరిలో ఎంతమంది అభ్యర్థులు తలపడతారనేది ఆసక్తి నెలకొన్నది. నవంబర్‌ 3న పోలింగ్‌ జరుగనుండగా, అదేనెల 6న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉండగా, తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి భారీ జనసందోహం నడుమ గురువారం మధ్యాహ్నం నామినేషన్‌ దాఖలు చేశారు.

ఇదీ చదవండి: ’మునుగోడు‘ పై కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలు

Exit mobile version