MI vs KKR: మురిసిన ముంబయి.. సీజన్ లో రెండో గెలుపు

MI vs KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. ఈ సీజన్ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్ ధనాదన్ మెరుపులతో అలవోక విజయాన్ని నమోదు చేసింది.

MI vs KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. ఈ సీజన్ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్ ధనాదన్ మెరుపులతో అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన వెంకటేష్ అయ్యర్ శ్రమ వృథా అయింది.

ఇషాన్‌ ధనాధన్‌..

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. ఈ సీజన్ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్ ధనాదన్ మెరుపులతో అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన వెంకటేష్ అయ్యర్ శ్రమ వృథా అయింది.

 

తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. వెంకటేశ్ అయ్యర్‌ సెంచరీతో చెలరేగడంతో.. 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన ముంబయి.. అలవోకగా లక్ష్యాన్ని చేరుకుంది. కేవలం..
17.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది. ఇషాన్‌ కిషన్‌ (58; 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అతడికి తోడుగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా రాణించాడు. తిలక్‌ వర్మ తనవంతు సాయంగా 30 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో సుయాష్‌ శర్మ రెండు వికెట్లు తీయగా, ఠాకూర్‌, వరుణ్ చక్రవర్తి, ఫెర్గూసన్‌లు తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అంతకు ముందు.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ మినహా పెద్దగా ఇతర బ్యాట్స్ మెన్స్ రాణించలేదు. ఇక ముంబయి బౌలర్లలో షోకీన్‌ రెండు, కామెరూన్‌ గ్రీన్‌, డ్యూన్‌ జాన్‌సెన్‌, పీయూష్‌ చావ్లా, మెరిడిత్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.