Site icon Prime9

Mukhachitram Movie: ఇంట్రెస్టింగ్ గా ఉన్న “ముఖచిత్రం” ట్రైలర్

mukha-chitram-movie-trailer-released

mukha-chitram-movie-trailer-released

Mukhachitram Movie: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరిస్తున్నారు. స్టార్ డమ్ గురించి కాకుండా, కంటెంట్ గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నారు. కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే చాలు, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతున్నాయి. అలాంటి చిన్న సినిమాల జాబితాలోనే త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మరో మూవీ ‘ముఖ చిత్రం’.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ఈ మూవీపై ఆసక్తిని పెంచుతుంది. ‘అందరూ అనుకుంటున్న కథ ఇది, అసలు జరిగింది ఇది’.. అంటూ కథలో అసలు పాయింటును చెబుతూ ఈ ట్రైలర్ ను వదిలారు. వికాస్ వశిష్ఠ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో, ప్రియ వడ్లమాని హీరోయిన్ గా కనిపించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో విశ్వక్ సేన్, చైతన్య రావు, రవిశంకర్ పోషించారు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని అందిచగా ఈ నెల 9వ తేదీన ఈ మూవీని విడుదల చేయనున్నారు చిత్ర బృందం.

ఇదీ చదవండి: పాప్యులారిటీ ఉన్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మాములే.. ఈడీ విచారణపై విజయ్ స్పందన

Exit mobile version