Site icon Prime9

OTT Release : ఈ ఒక్కరోజే ఓటీటీ లో సందడి చేయనున్న 15 సినిమాలు, 3 వెబ్ సిరీస్ లు.. ఏవేంటంటే?

movies-and-web-series-list-of-ott-release-in-today

movies-and-web-series-list-of-ott-release-in-today

OTT Release : చిత్ర పరిశ్రమలో థియేటర్, ఓటీటీ రెండింటికీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ముందు థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఆ తర్వాత కొంత గ్యాప్ తో ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఈ తరుణంలోనే ఈ ఒక్కరోజే 15 సినిమాలు.. మూడు వెబ్ సిరీస్ లు ఓటీటీ లో సందడి చేసేందుకు సిద్దమయ్యాయి. పలు ఓటీటీ లలో రిలీజ్ అవుతున్న ఆయా సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/వెబ్ సిరీస్ లు ..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

‘వారసుడు’..

విజయ్‌ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వారిసు’. సంక్రాంతి సందర్భంగా ‘వారసుడు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కుటుంబ కథా చిత్రంగా పర్వాలేదనిపించిన ఈ చిత్రం ఫిబ్రవరి 22వ తేదీ నుంచి తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. కుటుంబమంతా కలిసి చూడాలనుకుంటే మంచి ఆప్షన్‌.

‘వీరసింహారెడ్డి’..

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీ చంద్‌ మలినేని దర్శకత్వం వహించిన యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఫిబ్రవరి 23, అంటే గురువారం సాయంత్రం 6గంటల నుంచి ‘వీరసింహారెడ్డి’ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

క్రాంతి (కన్నడ చిత్రం తెలుగులో)..

దర్శన్ కథానాయకుడిగా వి.హరికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాంతి’. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఫిబ్రవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. కన్నడతో పాటు, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను అందుబాటులో ఉండనుంది.

‘మైఖేల్‌’..

సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మైఖేల్‌’. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని అందుబాటులోకి రానుంది.

‘వాల్తేరు వీరయ్య’..

చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఫిబ్రవరి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

 

 

నెట్‌ఫ్లిక్స్‌

అవుటర్‌ బ్యాంక్‌ (వెబ్‌సిరీస్‌3) ఫిబ్రవరి 23

వియ్‌ హేవ్‌ ఎ ఘోస్ట్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 24

ఎ క్వైట్‌ ప్లేస్‌2 (హాలీవుడ్‌) ఫిబ్రవరి 24

నాన్‌పాకల్‌ నేరత్తు మయ్యక్కం (తెలుగు/మలయాళం) ఫిబ్రవరి 24 స్ట్రీమింగ్‌ అవుతోంది.

డిస్నీ+హాట్‌స్టార్‌

రబియా అండ్‌ ఒలీవియా (హాలీవుడ్‌) ఫిబ్రవరి 24

వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ (అనిరుధ్‌ మ్యూజిక్‌ కన్సర్ట్) ఫిబ్రవరి 24

సోనీలివ్‌

ఇరు ధ్రువం2 (తమిళ్‌ ) వెబ్‌సిరీస్‌ (సీజన్‌2) ఫిబ్రవరి 24

పొట్లక్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 24

సన్‌నెక్ట్స్‌

అబ్ర (కన్నడ) ఫిబ్రవరి 24

జీ5

వాల్వీ (మరాఠీ) మూవీ ఫిబ్రవరి 24

పులిమేక (తెలుగు) వెబ్‌సిరీస్‌ ఫిబ్రవరి 24

 

మరికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఆయా ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి..

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version