Site icon Prime9

Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న మృతికి సంతాపంగా సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి..

movie and political prominent persons condolence to nandamuri taraka ratna

movie and political prominent persons condolence to nandamuri taraka ratna

Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న గత నెల 27న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా కుప్పంలో తీవ్ర గుండెపోటుకు గురికావడం తెలిసిందే. అప్పటి నుంచి గత మూడు వారాలుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం నాడు ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన మృతితో నందమూరి, నారా కుటుంబ సభ్యుల్లోనే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాలలో విషాదం అలుముకుంది.

తారకరత్న అకాల మరణం పట్ల సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, హరీశ్ రావు, రవితేజ, అల్లరి నరేష్, పలువురు సోషల్ మీడియా వేదికగా నివాళులు తెలిపారు.

 

 

తారకరత్న మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే మరణించడం పట్ల సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ట్వీట్ చేస్తూ.. ‘తారకరత్న మరణం గురించి తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. నందమూరి తారకరత్నది విషాదకరమైన అకాల మరణం. ప్రకాశవంతమైన, ప్రతిభావంతులైన, ఆప్యాయతగల యువకుడైన తారకరత్న చాలా త్వరగా వెళ్లిపోయాడు! ఈ భాదాకర సమయంలో కుటుంబ సభ్యులు, అభిమానులందరికీ నా సానుభూతి! అతని ఆత్మకు శాంతి కలుగుగాక! శివైక్యం’ అంటూ భావోద్వేగంగా సంతాపం ప్రకటించారు.

 

నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. ‘నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకొంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. ఆయన భార్యాబిడ్డలకి, తండ్రి మోహనకృష్ణకు, బాబాయి బాలకృష్ణకు, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు.

 

సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్లు (Nandamuri Taraka Ratna)..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version