Pakistan: పాకిస్తాన్ లో వరదలకు 148 మంది మృతి

భారీ వర్షాలతో పాకిస్తాన్ వణుకుతోంది. ఎడతెరిపిలెకుండా కురుస్తున్న వానలకు నెల రోజుల్లో 148 మంది మృత్యువాతపడినట్లు పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా ఇళ్లు, రోడ్లు వంతెనలు కొట్టుకొని పోయాయని.. దేశ వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని పాక్ అధికారులు తెలిపారు.

  • Written By:
  • Publish Date - July 12, 2022 / 02:31 PM IST

Pakistan: భారీ వర్షాలతో పాకిస్తాన్ వణుకుతోంది. ఎడతెరిపిలెకుండా కురుస్తున్న వానలకు నెల రోజుల్లో 148 మంది మృత్యువాతపడినట్లు పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా ఇళ్లు, రోడ్లు వంతెనలు కొట్టుకొని పోయాయని, దేశ వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని పాక్ అధికారులు తెలిపారు.

కరాచిలోచాలా ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. బెలూచిస్థాన్ ప్రావిన్సులో ఇప్పటి వరకు 63 మంది వర్షాల కారణంగా మృతి చెందారు. రాజధాని ఇస్లామాబాద్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. సింధు ప్రావిన్స్ రాజధాని కరాచీలోనూ.. ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు.