Site icon Prime9

Monkey Pox: ఫీవర్‌ ఆస్పత్రిలో మంకీ పాక్స్‌ వార్డు

Hyderabad: దేశంలో మంకీ పాక్స్‌ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిలో 36 పడకలతో మంకీ పాక్స్‌ వార్డును ఏర్పాటు చేసింది. విదేశాల నుంచి వచ్చే వారికి మంకీ పాక్స్‌ లక్షణాలు కనిపిస్తే విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడకు తీసుకురావాలని ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్‌ కోరారు.

అనుమానితుల రక్తం,యూరిన్‌, గొంతు నుంచి ఐదు రకాల శాంపిల్స్‌ సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపుతారని, ఫలితాల్లో అనుమానాలుంటే శాంపిల్స్‌ను మరోసారి పుణెకు పంపుతారన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే మంకీ పాక్స్‌ వార్డులో ప్రత్యేక చికిత్స అందించనున్నట్లు డాక్టర్‌ శంకర్‌ స్పష్టం చేశారు.

 

Exit mobile version