Mohan Babu: చిరంజీవికి అన్నయ్యగా.. ఈ సినిమా నాకేంతో ప్రత్యేకం

  • Written By:
  • Updated On - December 20, 2024 / 05:43 PM IST

Mohan Babu Latest Tweet: ప్రముఖ నటుడు మోహన్‌ బాబు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు ఆయన ఇంటి గొడవలు చర్చనీయాంశం అవుతుంటే.. మరోవైపు ఆయన అరెస్ట్‌ హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ పరిణామాల మధ్య మోహన్‌ బాబు తన సినీ ప్రస్థానాన్ని ట్విటర్‌ వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. గత కొన్ని రోజలుగా ఆయన సినిమాలకు సంబంధించిన క్లిప్స్‌ షేర్‌ చేస్తూ వాటితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

తాజాగా మోహన్‌ బాబు మరో ట్విట్‌ షేర్‌ చేశారు. మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి నటించిన సినిమాకు సంబంధించి వీడియో క్లిప్‌ షేర్‌ చేస్తూ ఈ సినిమాకు తన కెరీర్‌లో ప్రత్యేక స్థానం ఉందన్నారు. అదే ‘పట్నం వచ్చిన ప్రతివ్రతలు’ మూవీ. 1982లో మెగాస్టార్‌ చిరంజీవికి అన్నగా ఆయన నటించారు. “పట్నం వచ్చిన ప్రతివ్రతలు చిత్రానికి నా కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానం ఉంది. టాలంటెడ్‌ డైరెక్టర్‌ మౌలీ తెరకెక్కించిన సినిమా ఇది. ఇందులో నా పాత్రను చాలా గొప్పగా తీర్చిదిద్దారు.

ముఖ్యంగా నా స్నేహితుడు మెగాస్టార్‌ చిరంజీవికి అన్నగా నటిస్తూ ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం మరపురాని అనుభూతిని ఇచ్చింది. నా సినీ కెరీర్‌లో మరిపోలేని చిత్రాల్లో ఇది తప్పుకుండ ఉంటుంది” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. కాగా ఇండస్ట్రీలో చిరంజీవి, మోహన్‌ బాబులు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. అయితే కొన్నేళ్లుగా వారి మధ్య పెద్ద మాటలు లేవు. రాకపోకలు కూడా లేవు. వీరి మధ్య ఉన్న మనస్పర్థలు మా ఎన్నికల టైంలో బయటపడ్డాయి. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌కు మెగా ఫ్యామిలీ సపోర్టుగా నిలిచింది.

ఈ క్రమంలో మంచు విష్ణు నందమూరి బాలకృష్ణ సపోర్టు తీసుకున్నారు. పోటీలో ప్రకాశ్‌ రాజ్‌ ఉన్న వెనకాల మాత్రం మెగా ఫ్యామిలీ ఎన్నికలను నడిపిస్తుందనే టాక్‌ వినిపించింది. ఇక ఈ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచి మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కొంతకాలంగా ఎడమోహం పెడమోహంగా ఉన్న ఈ రెండు కుటుంబాల మధ్య ఇటీవల మాటలు కలిశాయి. కేంద్రం చిరంజీవికి పద్మ విభూషణ్‌ అవార్డును ప్రకటించడంతో ఆయనకు శుభకాంక్షలు తెలుపుతూ మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు. ఇక ఇటీవల నాగచైతన్య-శోభిత పెళ్లిలో వీరిద్దరు అప్యాయంగా పలకరించుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.