Warangal: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కమలాపూర్ లో తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్బంగా లబ్దిదారుల పై అసహనం వ్యక్తం చేసారు. కళ్యాణలక్ష్మి పైసలు వచ్ఛినయ్ రమ్మని చెప్పినా కొంతమంది రావడం లేదు. కేసీఆర్‌కు గర్జుండి డబ్బులు పంపిస్తున్నట్టుంది. రానివాళ్ల చెక్కులు క్యాన్సిల్ చేస్తా. అన్ని పథకాలు కావాలంటారు. మాకు మాత్రం ఓటెయ్యరు. మొన్న హుజూరాబాద్ ఎన్నికల్లో ఆయనకే ఓటెస్తిరి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు కళ్యాణలక్ష్మి లబ్ధిదారులతో థాంక్యూ కేసీఆర్ అని చెప్పించారు. దీనితో కౌశిక్ రెడ్డి తీరు పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Padi Kaushik Reddy: అన్ని పథకాలు కావాలంటారు, మాకు మాత్రం ఓటెయ్యరు.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

Kaushik Reddy