Site icon Prime9

MLC Elections : ఏపీ. తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా..

mlc eletions notification in andhra pradesh and telangana states

mlc eletions notification in andhra pradesh and telangana states

MLC Elections : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలలో కలిపి 10 సీట్లకు గాను తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసినట్లు తెలుస్తుంది. కాగా ఇందుకు సంబంధించి మార్చి 6న నోటిఫికేషన్ రిలీజ్‌ కానుండగా.. మార్చి 23న పోలింగ్, కౌంటింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 13గా ఈసీ నిర్ణయించింది.

ఏపీలో నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వర ప్రసాదరావు, వరాహ వెంకట సూర్య నారాయణ రాజు, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. మరో సభ్యుడైన ఎమ్మెల్సీ ఛల్లా భగరీథ రెడ్డి గతేడాది నవంబర్ లో కన్నుమూయడంతో.. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇక.. తెలంగాణలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్ ల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అధికార వైఎస్సార్సీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులు..

సూర్యనారాయణ రాజు (విజయనగరం)

పోతుల సునీత (బాపట్ల)

కోలా గురువులు (విశాఖ)

బొమ్మి ఇజ్రాయెల్ (కోనసీమ)

జయమంగళ వెంకటరమణ (ఏలూరు)

చంద్రగిరి ఏసురత్నం (గుంటూరు)

మర్రి రాజశేఖర్ (పల్నాడు) లను అభ్యర్థులుగా సీఎం జగన్ ప్రకటించారు.

ఇక తెలంగాణలో.. ఖాళీ అవుతోన్న 3 స్థానాలకు అధికార బీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే మూడు స్థానాలు బీఆర్ఎస్ కే దక్కే అవకాశాలు ఉన్నాయి. మరి సీఎం కేసీఆర్ ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తారో చూడాలి.

స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఏపీ నుంచి అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు, తెలంగాణ నుంచి హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఉన్నాయి. 18 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ స్థానిక కోటాలో 9 మంది, ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్‌ కోటాలో మరో ఇద్దరి పేర్లను ప్రకటించింది వైసీపీ. ఇందులో బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, ఓసీలకు 4 స్థానాలకు కేటాయించారు.

 

స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు..

నర్తు రామారావు (బీసీ- యాదవ), శ్రీకాకుళం జిల్లా

కుడిపూడి సూర్యనారాయణ (బీసీ -శెట్టి బలిజ), తూ.గో జిల్లా:

వంకా రవీంద్రనాథ్ (ఓసీ – కాపు), ప.గో జిల్లా

కవురు శ్రీనివాస్ (బీసీ – శెట్టి బలిజ), ప.గో జిల్లా

మేరుగ మురళీ (ఎస్సీ – మాల), నెల్లూరు జిల్లా

డా.సిపాయి సుబ్రహ్మణ్యం (వన్య కుల క్షత్రియ), చిత్తూరు జిల్లా

రామసుబ్బారెడ్డి (ఓసీ – రెడ్డి), కడప జిల్లా

డాక్టర్ మధుసూదన్‌ (బీసీ – బోయ), కర్నూలు జిల్లా

ఎస్. మంగమ్మ (బీసీ – బోయ), అనంతపురం జిల్లా

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు..

కుంభా రవి బాబు (ఎరుకుల – ఎస్టీ), అల్లూరి సీతారామరాజు జిల్లా
కర్రి పద్మ శ్రీ (బీసీ – వాడ బలిజ), కాకినాడ సిటీ

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version