Ycp Leaders Phone Tapping : వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని తనకి లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టి ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న ఆయన.. తాజాగా నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు..
అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది: కోటంరెడ్డి
కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు నాపై నిఘాపెట్టారు. అధికార పార్టీ నేతలపై నిఘా ఎందుకని బాధపడ్డా.
నా ఫోన్ ట్యాప్ అవుతోందని 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి చెప్పారు.
సీఎంపై కోపంతో ఆ అధికారి అబద్ధం చెప్పారని భావించా.
గత కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు నాపై నిఘా పెట్టారు. అనుమానం ఉన్నచోట ఉండాలని నాకు లేదు.. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.
వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని లేదు.. ఆ పార్టీ నుంచి పోటీకి నా మనసు అంగీకరించడం లేదు.
నన్ను సంజాయిషీ అడగకుండానే నాపై చర్యలు చేపట్టారు.
నేను ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఇబ్బంది అవుతుంది.
నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని ఆయన అన్నారు.
బాలినేని మాటలను సీఎం మాటలుగా భావిస్తున్నా. మంత్రులు, జడ్జిలు, మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాప్ అయిండొచ్చు.
మనసు ఒకచోట.. శరీరం మరోచోట ఉండటం నాకిష్టం లేదు.
అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది.’’ అంటూ తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు.
మీరు పొరపాటు చేసి ట్యాపింగ్ జరగలేదని అబద్ధాలు చెబుతారా? నన్ను అవమానించిన చోట నేను ఉండలేను’’ అని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.
జగన్..సజ్జల..విజయ్ సాయి రెడ్డి ఫోన్లను కేంద్రం ట్యాప్ చేసినట్లు మీకు ఆధారాలు వస్తే మీ స్పందన ఎలా ఉంటుంది
నాకు ఎవరు సమాధానం చెబుతారు : కోటంరెడ్డి
నేను ఐఫోన్ వాడుతున్నా.. నా మిత్రుడు లంకా రామ శివా రెడ్డి ఫోన్ చేస్తే మాట్లాడాను.
నా ఫ్రెండ్ ది కూడా ఐ ఫోన్.. ఇద్దరూ రికార్డ్ చేయలేము.
రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐ.జి. సీతారామాంజనేయులు నాకు ఫోన్ చేశారు
నాఫోన్ ట్యాప్ అవుతోందని చెప్పారు.. అందుకు గాను ఒక ఆడియో కూడా పంపారు
ఆధారాలు ఉన్నాయి కాబట్టే ట్యాపింగ్ జరిగిందని చెప్పా.. ఎం.ఎల్.ఏ మీద ట్యాపింగ్ చేశారంటే ఇది ఆగదు
మంత్రులు..హైకోర్టు జడ్జీలు…న్యాయవాదులు.. ఐ.ఏ.ఎస్. లు.. ఐ.పి.ఎస్.లు..మీడియా ప్రతినిధులు..
ఎం.పి.లు ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారు.
ట్యాపింగ్ పై ఎవరు నాకు సమాధానం చెబుతారు
98499 66000 నుంచి సీతారమంజనేయులు ఫోన్ చేశారు. ఇది ఆయన నెంబర్. కావాలంటే చెక్ చేసుకోండి అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం కోటంరెడ్డి చేసిన కామెంట్స్ ఏపీలో సంచలనంగా మారాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/