Site icon Prime9

Megastar Chiranjeevi : సీనియర్ రైటర్ సత్యానంద్ కి విషెస్ చెప్పిన మెగాస్టార్.. ఎమోషనల్ పోస్ట్ !

megastar chiranjeevi wishes to senior writer satyanand

megastar chiranjeevi wishes to senior writer satyanand

Megastar Chiranjeevi : ప్రముఖ సీనియర్ రైటర్ సత్యానంద్  ప్రేక్షకులకు సుపరిచితులే. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్,  పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తదితరుల సినిమాలకు రచయితగా పని చేశారు. దాదాపు 400కు పైగా సినిమాలకు రచయితగా పని చేశారు. సత్యానంద్ దేవుడు చేసిన పెళ్లి(1974) సినిమాతో డైలాగ్ రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత జ్యోతి (1976), అర్ధాంగి (1977), అమెరికా అల్లుడు(1985), క్షణ క్షణం(1991), అన్నయ్య(2000) లాంటి మరెన్నో చిత్రాలకు డైలాగ్స్ కూడా రాశారు. అలానే ఝాన్సీ లక్ష్మీబాయి కథని ‘ఝాన్సీ రాణి’గా సినిమాగా తెరకెక్కించారు. కానీ దర్శకులుగా సక్సెస్ కాలేకపోయారు.

అంతే కాకుండా మోసగాడు(1980), గూండా (1984), యముడికి మొగుడు (1988), పెళ్లాం ఊరెళ్లితే (2003), సుభాష్ చంద్రబోస్ (2005) చిత్రాలకు సత్యానంద్ స్క్రిప్ట్‌లు రాశారు. సముద్రం(1999), ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి(2004), నచ్చావులే (2008), రారండోయ్ వేడుక చూద్దాం(2017) చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు. ఇటీవల కాలంలో వచ్చిన నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’, రవిబాబు ‘ఆవిరి’ సినిమాలకు కూడా స్క్రీన్ ప్లే అందించారు.

కాగా  ముఖ్యంగా చిరంజీవి (Megastar Chiranjeevi)  సినీ ప్రయాణంలో ఈయన కూడా ఒక ప్రధాన పాత్ర పోషించారు అని చెప్పొచ్చు.  కొండవీటి సింహం, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, అంజి వంటి సినిమాలకు కథని అందించారు. ఆయా చిత్రాలు మెగాస్టార్ కెరీర్ లో ముఖ్య పాత్ర పోషించాయి. దీంతో చిరంజీవి, సత్యానంద్ మధ్య ఆత్మీయత ఉందని చెప్పాలి. ఈ క్రమంలోనే సత్యానంద్ 50 ఏళ్ళ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. మెగాస్టార్ ఈరోజు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ వేశాడు.

ఈ మేరకు ఆ పోస్ట్ లో.. ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్‌గా ఉంటూ.. ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటార్ గా, ఒక గైడింగ్ ఫోర్స్‌గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్‌గా ఉంటూ, సినిమాని ప్రేమిస్తూ, సినిమానే ఆస్వాదిస్తూ, సినిమాని తన జీవన విధానంగా మలచుకున్న నిత్య సినీ విద్యార్ధి , తరతరాల సినీ ప్రముఖులందరికీ ప్రియ మిత్రులు, నాకు అత్యంత ఆప్తులు, మృదు భాషి , సౌమ్యులు, సత్యానంద్ గారు తన సినీ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు నా హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు’ అని తెలిపారు.

ఆయనతో నా వ్యక్తిగత అనుబంధం , నా అనేక చిత్రాలలో ఆయన వహించిన పాత్ర ఎంతో ప్రగాఢమైనది. డియరెస్ట్ సత్యానంద్‌ గారు.. మీరిలాగే మీ సినీ పరిజ్ఞానాన్ని , సినీ ప్రేమని, అందరికీ పంచుతూ, మరెన్నో చిత్రాల విజయాలకు సంధాన కర్తగా, మరో అర్ధ శతాబ్దం పాటు ఇంతే ఎనర్జీ తో ఉండాలని ఆశిస్తున్నాను. మోర్ పవర్‌ టూ యూ’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

Exit mobile version