Site icon Prime9

Waltair Veerayya : మాస్ మహరాజ్ ఫ్యాన్స్ కి “వాల్తేరు వీరయ్య ” నుంచి ఊర మాస్ గిఫ్ట్ ..!

mass-maharaj-raviteja-video-released-from-waltair-veerayya-movie

mass-maharaj-raviteja-video-released-from-waltair-veerayya-movie

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన బాస్ పార్టీ లిరికల్ వీడియో యూట్యూబ్ ని షేక్ చేసిందని చెప్పొచ్చు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా తో చిరు వేసిన స్టెప్పులు అందరినీ ఉర్రూతలూగించాయి.

కాగా చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మెగాస్టార్ కి తోడు ఈ చిత్రంలో మాస్ మహరాజ్ కూడా ఓ పాత్ర చేయడం ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. ఇక ఇదే తరుణంలో మూవీ మేకర్స్ తాజాగా మాస్ మహరాజ్ రవి తేజ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా నుంచి రవితేజకి సంబంధించిన టీజర్ ని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

ఆ టీజర్ లో… ఓ మేకపిల్లని పట్టుకొని రవితేజ నడుచుకుంటూ వస్తుండగా ” మేకపిల్లని పట్టుకొని మొదటిసారి పులి వస్తుంది ” అంటూ వచ్చే డైలాగ్ తో వీడియో స్టార్ట్ అయ్యింది. ఇక ఆ తర్వాత రవితేజ తనదైన స్టైల్ లో ” ఏంరా వారి, పిస పిస చేస్తున్నావు, నీకింకా సమాజ్ గాలే, నేను ఎవ్వని అయ్యకి వినను అని చెప్పే డైలాగ్ అయితే ఊర మాస్ అనిపిస్తుంది. ఈ టీజర్ లో బాబీ రవితేజని పవర్ ఫుల్ గా చూపించారు. ఈ సినిమాలో రవితేజ ఏఎస్పీ విక్రమ్ సాగర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక అన్నయ్య చిరు – రవితేజ కాంబినేషన్ లో వచ్చే సీన్లు ధియేటర్లలో కేకలు పెట్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా ఉండగా… రవితేజ అభిమానులు, మెగా అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

Exit mobile version