Site icon Prime9

Kannappa: ‘కన్నప్ప నుంచి ప్రభాస్‌ లుక్‌ లీక్‌ – మంచు రియాక్షన్‌.. వారికి రూ. 5 లక్షల బహుమానం!

Prabhas Look Leak in Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఫాంటసీ డ్రామ రూపొందుతున్న ఈ సినిమాకు ముకేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మంగా మోహన్‌ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్‌ భాగం అవుతున్నారు. కన్నప్పలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల ప్రభాస్‌ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నారు. తన సినిమా షూటింగ్‌తో పాటు కన్నప్పలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణలోనూ పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఇవాళ కన్నప్పలోని ప్రభాస్‌ లుక్‌ లీకవ్వడంలో ప్రస్తుతం ఆ లుక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇది అన్‌ఆఫిషియల్‌గా ఎవరో లీక్‌ చేశారు. తాజాగా దీనిపై కన్నప్ప టీం స్పందిస్తూ ప్రభాస్‌ లుక్‌ లీకవ్వడంపై ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ లీక్‌ చేసిన వారిని కనిపెడితే వారికి రూ. 5 లక్షల కానుక ఇస్తామని ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు మంచు విష్ణు ఓ ప్రకటన చేశారు. “కన్నప్ప కోసం గత ఎనిమిది ఏళ్లుగా ఎంతో కృషి చేస్తున్నాం. మంచి అవుట్‌పుట్‌ ఇచ్చేందుకు మా ప్రాణాలు సైతం లెక్కచేయడం లేదు. రెండు సంవత్సరాల నుంచి ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటుంది. దీనికోసం మా టీం నిరంతరం కృషి చేస్తోంది. ఇలాంటి సమయంలో కన్నప్ప నుంచి ఓ ఫోటో అన్‌అఫిషియల్‌గా లీకైంది.

ఇది మమ్మల్ని ఎంతగానో బాధిస్తోంది. ఈ లీక్‌ మా కష్టాన్నే కాదు.. ఈ ప్రాజెక్ట్‌ కోసం పనిచేస్తున్న 2 వేల మంది కళాకారులు, వీఎఫ్‌ఎక్స్‌ డిజైనర్స్‌ జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ విషయమై మేము పోలీసులకు ఫిర్యాదు చేశాం. దయచేసి ఎవరూ కూడా కన్నప్ప ఫోటోను షేర్‌ చేయకండి. షేర్‌ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మరో విషయమేంటంటే.. ఈ ఫోటో లీక్‌ చేసిందేవరో కనిపెట్టిన వారికి రూ. 5 లక్షలు కానుక అందిస్తాం” అని కన్నప్ప టీం తన ప్రకటనలో పేర్కొంది.

Exit mobile version