Site icon Prime9

Manchu Family: మంచు ఫ్యామిలీ వివాదంలో మోరుమోగుతున్న జల్‌పల్లి ఫాంహౌజ్‌ – ప్యాలెస్‌ని తలపిస్తున్న మోహన్‌ బాబు ఇంటిని చూశారా?

Manchu Family Controversy

Manchu Family Controversy

Manchu Mohan Babu Jalpally Farmhouse: మంచు ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కాయి. తండ్రికొడుకలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులను ఆశ్రయించారు. గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదాలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. తన కొడుకు మనోజ్‌ అతని భార్య మౌనిక రెడ్డి తనపై దాడికి యత్నించారని, అసాంఘిక శక్తుల వల్ల తన ప్రాణాలకు, ఆస్తికి రక్షణ కల్పించాలంటూ రాచకోండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మనోజ్‌ తనపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఈ వార్తలను మోహన్‌ బాబు టీం ఖండించింది. కానీ అసలు సంగతి ఇదంటూ మనోజ్‌ కుటుంబంలో గొడవలను బహిర్గతం చేశాడు.

ఈ మేరకు తన ట్విటర్‌ వేదికగా ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేశాడు. మొత్తంగా చూస్తుంటే మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. మనోజ్‌ అక్రమంలో జల్‌పల్లిలోని తన నివాసానికి ఆక్రమించుకున్నాడంటూ మోహన్‌ బాబు ఆరోపించారు. అలా మోహన్‌ బాబు, మనోజ్‌ వివాదంలో జల్‌పల్లి నివాసం కీలకంగా మారింది. ప్రస్తుతం మోహన్‌ బాబు, మంచు మనోజ్‌, మంచు విష్ణు ముగ్గురు కూడా జల్‌పల్లిలోని ఇంటిలోనే ఉన్నారు. కాసేపటి క్రితమే దుబాయ్‌ నుంచి వచ్చిన విష్ణు నేరుగా జల్‌పల్లిలోని మోహన్‌ బాబు ఇంటికే చేరుకున్నాడు. ప్రస్తుతం అక్కడే కూర్చోని చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున్న అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది.

మా నాన్న Home Tour || Lakshmi Manchu

ఇదిలా ఉంటే ఈ గొడవలో ఎక్కవగా మంచు టౌన్‌ జల్‌పల్లి ఫాంహౌజ్‌ పేరుగా మారుమోగుతుంది. ఈ ఫ్యామిలీ ఘర్షణలకు కారణం ఈ ఫామ్‌హౌస్‌ అని తెలుస్తోంది. దీంతో జల్‌పల్లి హౌజ్‌ ఆసక్తికరంగా మారింది. శంషాబాద్ సమీపంలోని జల్‌పల్లి అనే గ్రామంలో భారీగా భూమిని కొనుగోలు చేసి అక్కడ ప్యాలెస్ లాంటి ఇంటిని నిర్మించుకున్నారు మోహన్‌ బాబు. మైలార్ దేవుపల్లి మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఇంటి చుట్టూ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. చూట్టూ ఎలాంటి నిర్మాణాలు, ఇల్లు లేకపోవడంతో మోహన్‌ బాబు ఇల్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇంద్రభవనాన్ని తలపించే ఈ ఇంటిలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఫిలిం నగర్‌లోని తన ఇంటినిక కాకుండా మోహన్‌ బాబు ప్రత్యేకంగా శంషాబాద్ దగ్గరలోని జల్‌పల్లిలో ఈ ఇంటిని నిర్మించుకున్నారట.

ప్రశాంతంగా ప్రక్రతి దగ్గరగా జీవించాలనే ఉద్దేశంతో చూట్టు చెట్లు పచ్చని వాతావరణంలో తన అభిరుచికి తగ్గట్టుగా ఈ ఫాంహౌజ్ నిర్మించుకున్నారు. ఇక్కడ అన్ని రకాల పండ్ల చెట్లు, ఇతర చెట్లు ఉన్నాయి. ఇంటిలో స్వీమ్మింగ్‌ పూల్‌ ఉంది. ఇంటిపైన కూడా స్విమ్మింగ్‌ ఫూల్, పనివాళ్లకు విడిగా ఇళ్లు, పెద్ద గార్డెన్ ఉంది. రెండేళ్ల క్రితమే నిర్మించిన ఈ ఇంటిని మోహన్‌ బాబు కూతురు లక్ష్మీ మంచు హోంటూర్‌ కూడా చేసింది. ప్యాలెస్‌ని తలపించేలా ఉన్న ఈ ఇంటిని చూసి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. దీంతో ‘మా నాన్న హోంటూర్‌’ అని చేసిన ఈ వీడియో ఏకంగా 11 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. ఇందులో ఇంటిలో ఏ మూల ఏముందో చూపిస్తూ వాటి ప్రత్యేకతలను వివరించింది. అంతేకాదు ప్రత్యేకంగా డిజైన్‌ ఇంటిరియల్‌ డిజైన్స్, పెయింటింగ్‌ ప్రత్యేకతలను వివరిస్తూ ఈ హోంటూర్‌ చేసింది. మరి మీరూ ఈ ఇంటిపై ఓ లుక్కేయండి.

Exit mobile version
Skip to toolbar