Site icon Prime9

Manchu Manoj: దిష్టి మొత్తం పోయింది – వెల్‌కమ్‌ బ్యాక్‌ బాబాయ్.. మంచు మనోజ్‌ ఆసక్తికర ట్వీట్‌

Manchu Manoj Tweet Viral: రెండు రోజులు క్రితం మంచు ఫ్యామిలీ వివాదాలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. రెండు రాష్ట్రాల ప్రజలంతా సినీ నటుడు మోహన్‌ బాబు ఇంట ఏం జరుగుతుంది? అసలు ఆ గొడవలు ఏంటో తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపారు. తండ్రికొడుకులు మనోజ్‌, మోహన్‌ బాబులు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇక జల్‌పల్లిలోని మంచు డౌన్‌ వద్ద జరిగిన హైడ్రామా అంతా ఇంతా కాదు. ఆ రోజులో మంచు తగాదాలు రచ్చకెక్కాయి. అయితే అసలు గొడవలు ఏంటనేది ప్రెస్‌మీట్‌ పెట్టి బయటపెడతానంటూ మీడియా సమావేశంలో మనోజ్ చెప్పాడు. దాంతో విష్ణు, మోహన్‌బాబు దిగొచ్చి కూర్చోని మాట్లాడుకునేందుకు రెడీ అయ్యారు. దీంతో మంచు ఫ్యామిలీ వివాదాలు సద్దుమనిగాయి.

ఇదిలా ఉండగానే ఒక్కసారి అల్లు అర్జున్‌ అరెస్ట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ జైలుకు కూడా వెళ్లడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ రోజు బెయిల్‌పై బయటకు వచ్చిన బన్నీకి ఇండస్ట్రీ ప్రముఖులంతా ఒక్కొక్కరుగా సంఘీభావం తెలిపారు. సినీ ప్రముఖులు వరుసగా ఆయన నివాసానికి వచ్చి పలకరించారు. అయితే ఇంత వరకు మంచు ఫ్యామిలీ దీనిపై స్పందించలేదు. తాజాగా అల్లు అర్జున్‌ అరెస్ట్‌ మంచు మనోజ్‌ స్పందించాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ దిష్ట మొత్తం పోయింది బాబాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

దిష్టి మొత్తం పోయింది బాబాయి. వెల్‌కమ్‌ బ్యాక్‌ అల్లు అర్జున్‌. ఇలాంటి క్లిష్ట సమయంలో నువ్వు చూపించిన అచంచలమైన బాధ్యత, పోలీసులకు సహకరించిన తీరుకు నీకు హ్యాట్సాఫ్‌ చెప్పకుండ ఉండలేకపోతున్నా. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో మీ సమయానుకూల ప్రతిస్పందన మీ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుంది. మీకు, మీకు కుటుంబానికి శాంతి, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. అయితే, సంధ్య థియేటర్‌లో వద్ద జరిగిన విషాద ఘటన నిజంగా హృదయ విదారకమైనది. అది మనందరికీ భద్రతను ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావుతం కాకుండ జాగ్రత్త పడాలని గుర్తు చేస్తుంది” అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం మనోజ్‌ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.

Exit mobile version