Site icon Prime9

Manchu Manoj : సస్పెన్స్ కి తెరదించిన మంచు మనోజ్.. “వాట్ ది ఫిష్” అనే క్రేజీ టైటిల్ తో మూవీ

manchu manoj new movie tilted as what the fish

manchu manoj new movie tilted as what the fish

Manchu Manoj : టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే.

వైవిధ్యభరిత చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతున్నారు.

అయితే ఇటీవల కాలంలో మంచు మనోజ్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచారు.

ఒకవైపు తన పర్సనల్ లైఫ్, మరోవైపు ఫిల్మ్ కెరీర్ కి సంబంధించి మీడియాలో వార్తలు వస్తూనే ఉంటున్నాయి.

మంచు మనోజ్ చివరిగా ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

2017 లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోలేక పోయింది.

ఆ తరువాత రెండు సినిమాల్లో గెస్ట్ రోల్ లో కనిపించి అలరించాడు.

అయితే తాజాగా తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు మనోజ్.

క్రేజీ టైటిల్ తో వస్తున్న మంచు మనోజ్(Manchu Manoj) ..

దాదాపు 5 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వనున్నాడు ఈ యంగ్ హీరో.

తాజాగా తన కొత్త సినిమాని ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆ మూవీ టైటిల్ ని రివీల్  చేశాడు.

ఈ చిత్రానికి ‘వాట్ ది ఫిష్’ అనే టైటిల్ ని ఖరారు చేయగా.. ‘మనం మనం బరంపురం’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో చుట్టూ గ్యాంగ్ స్టార్స్ ఉంటే మధ్యలో మంచు మనోజ్ నుంచి ఉన్న దృశ్యం కనిపిస్తుంది.

ఈ చిత్రానికి వరుణ్ అనే కొత్త వ్యక్తి కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు.

క్రేజీ గా ఉన్న ఈ టైటిల్ మనోజ్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది.

 

మంచు మనోజ్ 2015 లో హైదరాబాద్ కు చెందిన ప్రణతి అనే అమ్మాయిని అతడు పెళ్లి చేసుకున్నాడు.

అయితే పెళ్లి అయిన రెండేళ్లకే వారి మధ్య మనస్పర్ధల కారణంగా విడాకులు కూడా తీసుకున్నాడు.

కాగా గత కొంతకాలంగా దివంగత టిడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనిక రెడ్డితో అతడు ప్రేమలో ఉన్నాడని వార్తలు వినిపించాయి.

ఇక వీరిద్దరూ కలిసి ఎన్నోసార్లు మీడియా కంటపడగా వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ కారణంగానే గత కొంత కాలంగా ఈ హీరో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దీంతో మంచు మనోజ్ సినిమాలకి బ్రేక్ ఇచ్చేశాడు అంటూ వార్తలు వినిపించాయి.

ఈ అనౌన్స్ మెంట్ తో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడనే వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు మనోజ్.

అంతకు ముందు ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాని కూడా చేస్తున్నట్లు మనోజ్ ప్రకటించాడు.

ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వస్తున్నప్పటికి.. షూటింగ్ జరుగుతుందని మనోజ్ సన్నిహితులు చెబుతున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version