Site icon Prime9

Manchu Lakshmi : ఏపీ పాలిటిక్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు లక్ష్మి.. ఏమందంటే ??

manchu lakshmi shocking comments on ap politics

manchu lakshmi shocking comments on ap politics

Manchu Lakshmi : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లక్ష్మీ మంచు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లక్ష్మీప్రసన్న నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు పొందింది. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011 లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అనేక సినిమాలలో కీలకపాత్రలలో నటించిన లక్ష్మీ ప్రసన్న ఇటీవల నిర్మాతగా కూడ మారింది. అలాగే బుల్లితెర మీద ప్రసారమైన టీవీ షోలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం వంశీకృష్ణ దర్శకత్వం వహించిన అగ్ని నక్షత్రం అనే సినిమాలో కీలక పాత్రలో నటించిన లక్ష్మీ ప్రసన్న ఆ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఇటీవల మంచు లక్ష్మి యూట్యూబ్ లోకి కూడా ఎంటర్ అయింది. మై హోమ్ టూర్, మై మేకప్ అంటూ మంచు లక్ష్మి యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తోంది.

ఇక కేవలం సినిమాల పరంగానే కాకుండా మంచు లక్ష్మి (Manchu Lakshmi )  పర్సనల్ లైఫ్ పరంగా కూడా ఎక్కువ ట్రోల్ కి గురవుతూ ఉంటారు.  అయితే అప్పుడప్పుడూ మంచు లక్ష్మి తాను చేసే కామెంట్స్ వల్ల ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. తాను టాలీవుడ్ కి వచ్చి పొరపాటు చేశానని .. హాలీవుడ్ లో ఉండి ఉంటే ఇంకా ఎక్కువ ఆఫర్స్ తో మంచి గుర్తింపు పొందేదాన్ని అంటూ ఆ మధ్యన మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ జరిగింది. అయితే తాజాగా మరోసారి మంచు లక్ష్మి వార్తల్లో నిలిచింది.

తాజాగా ఏపీ రాజకీయ పరిణామాలపై మంచు లక్ష్మి ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచగా..  పవన్ కళ్యాణ్, బాలయ్య, లోకేష్ గురువారం రోజు పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్.. టిడిపి, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి వెళతాయని అధికారికంగా అనౌన్స్ చేసారు. దీంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.  ఈ క్రమంలోనే వైకాపా నేతలు పవన్ పై విమర్శలు సంధిస్తున్నారు.

ఈ తరుణంలోనే మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేసింది. ‘వావ్ ఇప్పుడు ఏపీ రాజకీయాలు మరింత మజా ఇచ్చేలా మారాయి, ఆసక్తికరంగా మారాయి అంటూ పేర్కొంది. దీనితో ఆమె అభిమానులు, నెటిజన్లు ఆ ట్వీట్ ని షేర్ చేస్తూ వైరల్ గా మారుస్తున్నారు.

 

 

Exit mobile version