Site icon Prime9

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ – మెగా ఫ్యాన్స్‌ గెట్‌ రెడీ, దీపావళికే అదిరిపోయే అప్‌డేట్‌..

Game Changer Teaser

Game Changer Teaser Release Date Confirmed: మెగా ఫ్యాన్స్‌కి ‘గేమ్‌ ఛేంజర్‌’ టీం అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ వెండితెరపై కనిపించి రెండేళ్లు దాటింది. ఆర్‌ఆర్ఆర్‌ సినిమాతో రామ్‌ చరణ్‌ నటించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. సన్సెషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో సెట్‌పైకి వచ్చినా.. రెండున్నర ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లో సందడి చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీం ఫ్యాన్స్‌కి దీపావళి కానుకగా రెడీ చేసింది. తాజాగా అదేంటో చేబుతూ గేమ్‌ ఛేంజర్‌ మేకర్స్‌ ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా సరికొత్తగా ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

దీపావళి సందర్భంగా గేమ్‌ ఛేంజర్‌ మూవీ నుంచి టీజర్‌ రిలీజ్‌ చేయబోతున్నట్టు మేకర్స్‌ వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా చరణ్‌ కొత్త లుక్‌ విడుదల చేసింది. ఇందులో రామ్‌ చరణ్‌ ప్రభుత్వ అధికారి లుక్‌లో కనిపించాడు. కుర్చిలో కూర్చోని ఉన్న చరణ్‌ ముందు ఒక పెద్ద టేబుల్‌ ఉంది. ఎదురుగా జనాలు పరుగెడుతూ చరణ్‌పైకి దూసుకువస్తున్నట్టు కనిపించారు. వారి చేతిల్లో ఆయుధాలు కూడా ఉన్నాయి. చరణ్‌ లుక్‌ మాత్రం కనిపించకుండ బ్యాక్‌ పోస్టర్‌ చూపించి ఆడియన్స్‌లో క్యూరియాసిటి పెంచారు. అయితే ఈ పోస్టర్‌పై 75 అని పెద్దగా రాసి ఉంది. అది మూవీ రిలీజ్‌కి కౌంట్‌డౌన్‌గా ఇండికేట్ చేశారు.

వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న గేమ్‌ ఛేంజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్టు ఇటీవల మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తేదీ ప్రకారం చూస్తే మూవీ రిలీజ్‌కు ఇంకా 75 రోజులు ఉంది. అదే పోస్టర్‌లో మెన్షన్‌ చేస్తూ టీజర్‌ అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం.  ప్రస్తుతం ఈ కొత్త పోస్టర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. కాగా గేమ్ ఛేంజర్ పై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రమిది. దీంతో గేమ్ ఛేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల తరచూ వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల సినిమాను డిసెంబర్ కు రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజ్ ఓ ఈవెంట్ లో చెప్పాడు.

కానీ ఈ మూవీ మరోసారి వాయిదా పడి ఈసారి సంక్రాంతి బరిలో నిలిచింది. 2025 జనవరి 10న మూవీని విడుదల చేస్తున్నట్టు ఇటీవల మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇక ఇప్పుడు మూవీ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో  ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇక గేమ్ ఛేంజర్ నుంచి ఇలా వరుసగా అప్డేట్స్ వస్తుండటంతో  కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. అలాగే హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో కనిపించనుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రంలో శ్రీకాంత్, సముద్రఖని, సునీల్ వంటి తదిరతులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version