Site icon Prime9

Mahesh Babu: నయనతార డాక్యుమెంటరీపై మహేష్‌ బాబు రివ్యూ – ఏమన్నారంటే..!

Mahesh Babu Reaction on Nayanthara Documentary: లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఓవైపు తన డాక్యుమెంటరీతో ప్రశంసలు అందకుంటూనే మరోవైపు ధనుష్‌ ఫ్యాన్స్‌ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఆమె జీవిత కథను నెట్‌ఫ్లిక్స్‌ ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిర్‌ టేల్‌’తో డాక్యుమెంటరీ తీసిన సంగతి తెలిసిందే. ఆమె బర్త్‌డే సందర్భంగా నవంబర్‌ 18న విడుదలైంది. దీనిపై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఇదే డాక్యుమెంటరితో ధనుష్‌తో వివాదంలో నిలిచింది నయన్‌.

ఈ కాంట్రవర్సి మధ్యలో నయనతారపై మహేష్‌ బాబు పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. కాగా నయనతార డాక్యుమెంటరీ నిన్న విడుదలవగా దీనిపై సినీ సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ సైతం ప్రశంసలు కురిపిస్తూ తన రివ్యూ ఇచ్చింది. తాజాగా మహేష్‌ బాబు కూడా నయన్‌ డాక్యుమెంటరీపై స్పందించారు. ఆమె డాక్యుమెంటరీ చూసిన ఆయన తన రియాక్షన్‌ తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు. నయతార డాక్యుమెంటరికి సంబంధించిన పిక్‌ షేర్‌ చేస్తూ హార్ట్‌ ఎమోజీలను యాడ్‌ చేశారు.

ఎలాంటి కామెంట్‌ చేయకుండ జస్ట్‌ మూడు రెడ్‌ ఎమోజీలతో తన రియాక్షన్‌ తెలిపారు. నయన్ డాక్యుమెంటరీపై ఆయన స్పందించడం ప్రస్తుతం ఆసక్తిని సంతరించుకుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సినిమాలే కాకుండా డాక్యుమెంటరీలు కూడా చూస్తున్నారా? అని కొందరు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక మహేష్‌ బాబు నయన్‌ డాక్యుమెంటరీ నచ్చడంతో అందరి దృష్టి దీనిపై పడింది. మరోవైపు ఇదే డాక్యుమెంటరీ విషయంలో నయనతారకు ధనుష్‌కు మధ్య వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో ధనుష్‌ నిర్మాణంలో తన భర్త విఘ్నేశ్‌ శివన్‌ తెరకెక్కించిన ‘నానుమ్‌ రౌడిదాన్‌’లోని మూడు సెకన్ల క్లిప్‌ వాడారు.

తన అనుమతి లేకుండా సినిమాలోని క్లిప్‌ వాడినందుకు ధనుష్‌, నయన్‌కు రూ. 10 నష్టపరిహారం డిమాండ్‌ చేస్తూ నోటీసులు ఇచ్చాడు. ఇదే విషయాన్ని బయటపెడుతూ ధనుష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మూడు సెకన్ల క్లిప్‌ కోసం రూ. 10 కోట్లు డిమాండ్‌ చేయడం.. నీ క్యారెక్టర్‌ బయట పడిందని, ఇంతలా దిగజారుతావని అనకోలేదు ధనుష్‌పై అసహనం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి ఆమె ధనుష్‌ ఫ్యాన్స్‌ నుంచి నెట్టింట తీవ్ర నెగిటివిటీ ఎదుర్కొంటుంది. ఆమె గత రిలేషన్స్‌, బ్రేకప్స్‌ గురించి ప్రస్తావిస్తూ క్యారెక్టర్‌ లెస్‌ లేడీ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ చేశారు. మరోవైపు అనుపమ పరమేశ్వరణ్‌, చిన్మయ్‌, సింగర్‌ సుచిత్రతో పాటు పలువురు నటీమణులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

Exit mobile version