Site icon Prime9

Maharashtra: ఓటు ఉంటేనే కాలేజీలో అడ్మిషన్.. ప్రభుత్వం వింత నిర్ణయం..!

Maharashtra government To Make Voter Registration Mandatory For College Admission

Maharashtra government To Make Voter Registration Mandatory For College Admission

Maharashtra: భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరునికి కల్పించిన హక్కుల్లో ముఖ్యమైనది ఓటు హక్కు దీని ద్వారా మన ప్రభుత్వాన్ని మనమే ఎంపిక చేసుకోగలం. కాగా అలాంటి అత్యున్నతమైన ఓటుహక్కును ప్రస్తుతం కాలంలో యువత నిర్లక్ష్యం చేస్తుంది. కొంత మంది ఓటరుగా నమోదు చేయించుకోకపోవడం, మరికొందరు ఓటు ఉన్నా దానిని సద్వినియోగ చేసుకోకపోడం వంటి వాటిని చూస్తూనే ఉన్నాం. అయితే  ఇలాంటి వాటికి చెక్ పెడుతూ ఓటరుగా నమోదుపై యువతలో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని తొలగించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు హక్కు ఉంటేనే కాలేజీలో అడ్మిషన్ ఇస్తామంటూ రూల్ పాస్ చేసింది.

కాలేజీల్లో ప్రవేశాలను ఓటు హక్కుతో ముడిపెట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం. అడ్మిషన్ కావాలంటే ఓటు హక్కు తప్పనిసరిగా ఉండాలనే రూల్ ను తీసుకురానున్నట్లు తెలిపింది. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ తమ పేరును ఓటరుగా నమోదు చేయించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త రూల్ అమలు చేయనున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఉన్నత విద్యావ్యవస్థలో 50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు వారంతా 18ఏళ్లకు పైబడిన వారే. అయితే వారిలో ఇప్పటి వరకు కేవలం 32 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు కోసం ముందుకొచ్చారు. దీంతో 50 మంది విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలు, కాలేజీలలో అడ్మిషన్ కావాలంటే ఓటు హక్కు ఉండాల్సిందేనని రూల్ తెచ్చారు.

ఇదిలా ఉంటే మరోవైపు, యూనివర్సిటీలలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలులోకి తీసుకురానున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ)లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక ఎన్ఈపీ అమలులో వచ్చే ఇబ్బందులు, అనుమానాల పరిష్కారం కోసం విశ్రాంత వీసీలతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి: కోతికి జీవిత ఖైదు.. ఎందుకో తెలుసా..?

Exit mobile version