Site icon Prime9

AP Politics : ఏపీలో హీట్ ఎక్కుతున్న అమర్నాథ్ – హరిరామ జోగయ్య రగడ.. లేఖల యుద్ధం

letters fight between minister amarnath and harirama jogayya in ap politics

letters fight between minister amarnath and harirama jogayya in ap politics

AP Politics : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత ముదురుతున్నాయి.

అధికార పార్టీ వైఫల్యాలని విమర్శిస్తుండడంతో వైసీపీ – జనసేన, తెదేపా పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతుంది.

వీటికి మరింత ఊతాన్ని ఇస్తూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య వర్సెస్ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధం రాష్ట్రంలో మరింత హీట్ పుట్టిస్తుంది.

తాజాగా హరిరామ జోగయ్యకు మంత్రి అమర్‌నాథ్ మరో రెండు లేఖలు రాశారు. మొదటి లేఖ ఈ నెల 5 వ తేదీన రాయగా.. ఈరోజు మరో రెండు లేఖలు ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.

ముందుగా ఆ రెండో లేఖలో మంత్రి అమర్‌నాథ్ ఏం రాశారంటే (AP Politics)..

గౌరవములైన హరిరామ జోగయ్య గార్కి, నమస్కారములు .

కాపుల భవిష్యత్తు విషయములో చంద్ర బాబు ఆ తో జత కడుతున్న పవన్ కళ్యాణ్ గారికి రాయవలసిన, చెప్పవలసిన విషయాలు పొరపాటునా నాకు వ్రాసినారు.

మీకు ఆయురారోగ్యాలతో పాటు, మీరు మానసికం గా దృఢంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

 

(AP Politics) మంత్రి అమర్‌నాథ్ ఆ మూడో లేఖలో ఏం రాశారంటే..

గౌరవనీయులైన హరిరామ జోగయ్య గారికి మరోసారి నమస్కరిస్తూ… అడుగుతున్నాను-

మరోసారి వంగవీటి మోహన రంగా గారిని చంపించిన చంద్రబాబు నాయుడుకు పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తారా..?

ఈ ప్రశ్నకు సమాధానం నేరుగా చెప్పకుండా, నా మీద లేనిపోని ఆరోపణలు చేయటం వల్ల కాపు జాతి మిమ్మల్ని హర్షిస్తుందా..?

నేను వేసిన ప్రశ్న ద్వారా కాపులకు చంద్రబాబును దూరం చేయాలన్నది నా వ్యూహం అన్నారు.

అంతేకాక, పవన్ కల్యాణ్ కు కూడా కాపుల్ని దూరం చేయాలన్నది నా వ్యూహం అన్నారు.

ఇన్ని వ్యూహాలు నాకు అవసరం లేదు. రంగాను చంపించినది ముమ్మాటికీ నాటి టీడీపీ నాయకత్వమే అన్నది కాపు డీఎన్ఏ ఉన్న ఎవరిని అడిగినా చెబుతారు.

మీరు, పవన్ కళ్యాణ్.. దీనికి మినహాయింపు అయితే అది మీ ఇష్టం!

మీ పుస్తకంలో మీరు రాసిన విషయాల్ని మేం పదే పదే కోట్ చేయటం మీకు బాధ కలిగించిందని మాకు ఇంతవరకూ తెలియదు.

దాన్ని మీరు ఇలా విత్ ‘డ్రా కూడా మాకు తెలియదు. కాబట్టి, మీ పుస్తకంలో మీరు తప్పులు రాసి ఉంటే, ఉంటే అదే విషయం చెప్పండి. చేసుకుంటారని అబద్ధాలు రాసి

మీరు రాసిన వాక్యాలే వేద వాక్కులు అని మేము కోట్ చేయడం లేదు.

ఈ నిజాన్ని, అంటే రంగా గారి హత్యకు టీడీపీ, బాబు కారణమన్న నిజాన్ని చెప్పిన అనేక మందిలో మీరు కూడా ఉన్నారని మేం భావించాం.

 

మేం చంద్రబాబు గారి కుమారుడి గురించి మాట్లాడటం లేదు. చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నాం. అలాగే రంగా గారి కుమారుడి గురించి, దేవినేని నెహ్రూ గారి కుమారుడి గురించి మేము

మాట్లాడటం లేదు. కుమారులను చూపి, తండ్రిని వదిలేయాలన్న మీ థియరీ కరెక్టో కాదో మీరే నిర్ణయించుకోండి.

ఇక మీరు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు.

1) 2024లో మా పార్టీ గెలుస్తుంది. జగన్ గారే సీఎం అవుతారు. తద్వారా కాపు వ్యతిరేక చంద్రబాబును చిత్తుగా ఓడించడం సాధ్యమవుతుందని నేను మనసా, వాచా, కర్మణా నమ్ముతున్నాను.

కాపు ఓట్లను అంతో ఇంతో ప్రభావితం చేసి, ఆ ఓట్లను మూటగట్టుకుని కాపు వ్యతిరేక చంద్రబాబుకు అమ్మేయాలన్న పవన్ కల్యాణ్ ఆలోచల్ని నేను నిజాయితీగా వ్యతిరేకిస్తున్నాను.

2) ఇక ఈ డబ్ల్యూఎస్ కు సంబంధించి, మీరు అడిగిన ప్రశ్నలకు అత్యున్నత న్యాయస్థానాలు సమాధానం చెబుతాయి.

వారి తీర్పులను మా ప్రభుత్వం శిరసావహిస్తుంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా కాపులకు న్యాయం జరిగింది మా ప్రభుత్వంలోనే

గుడివాడ గుర్నాథరావు, గుడివాడ అమర్నాథ్ కాపులు అవునా, కాదా అన్న విషయంలో మీ సర్టిఫికేట్లు మాకు అవసరం లేదు.

మీలో ఇప్పటికీ ప్రవహిస్తున్న తెలుగుదేశం ఆలోచనల రక్తం, తెలుగు దేశం ప్యాకేజీల రక్తం… మీ ఇద్దరి డీఎన్ఏలను మార్చవచ్చేమోగానీ మా డీఎన్ఏలను మార్చలేదు! మేం చంద్రబాబును ప్రశ్నిస్తే.. చంద్రబాబుతో జత కట్టడాన్ని ప్రశ్నిస్తే, ఏకంగా మా పుట్టుకల్నే ప్రశ్నిస్తామన్న మీ కుసంస్కారానికి కూడా, నిజమైన కాపులం కాబట్టి, మరోసారి నమస్కరిస్తూనే సంస్కారవంతంగా సమాధానం ఇస్తున్నా అని రాసుకొచ్చారు.

 

గతంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ రాసిన లేఖలో కాపుల భవిష్యత్తు విషయములో చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కళ్యాణ్ గార్కి రాయవలసిన, చెప్పవలసిన విషయాలు పొరపాటున నాకు రాశారు.

మీకు ఆయురారోగ్యాలతో పాటు, మీరు మానసికంగా దృఢంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీ గుడివాడ అమర్నాథ్ అంటూ ఈ నెల 5వ తేదీన లేఖ రాశారు.

 

అంతకు ముందు హరిరామ జోగయ్య రాసిన లేఖలో.. డియర్ అమర్నాథ్.. రాజకీయాల్లో నువ్వు ఓ బచ్చావి.. పైకి రావలసిన వాడివి.. సాధారణ మంత్రి పదవి కోసం అమ్ముడుపోయి కాపుల భవిష్యత్ ని పాడు చేయకు.. అనవసరంగా పవన్ కళ్యాణ్ పై బురద జల్లడానికి ప్రయత్నం చేయకు.. నీ భవిష్యత్ కోరి చెబుతున్న అని రాసుకొచ్చారు.

మంత్రి అమర్నాథ్ లేఖలకు జనసైనికులు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version