Weather Update: ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 18,19,20న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
18న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని.. దానివల్ల మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొనింది. గోదావరి పరిహాక ప్రాంతాలు, విశాఖ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. లంకగ్రామాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాని అవసరమైతే సంబంధిత అధికారలను సంప్రదించాలని హెచ్చరించింది. కాగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇదీ చదవండి: Saudi Man: 43 ఏళ్లలో 53 పెళ్లిలు… ఈ వివాహాల వెనుక కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!