Rain Alert: హై అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. కాగా రాగల మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. కాగా రాగల మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

తెలంగాణలో పలు ప్రాంతాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వాన ముసురుపట్టుకుంది. దానితో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కుండపోత వానలు పడుతున్నాయి. రాగల మూడురోజులపాటు ఇలాంటి వాతావరణమే కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉండడం వల్ల ఆవర్తనం ఎఫెక్ట్ అధికంగా ఏపీకే ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అమరావతి, విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇకపోతే కరువు జిల్లాలు అయిన రాయలసీమలోనూ గతంలో ఎన్నడూలేని విధంగా వర్షపాతం నమోదు అవుతోంది.

ఇదీ చదవండి: ఏందిరా సామీ.. 28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు..!