Site icon Prime9

Kotamreddy Sridhar Reddy : ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై సీఎం జగన్ సమాధానం చెప్పాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్..

Kotamreddy Sridhar Reddy sensational comments on cm ys jagan

Kotamreddy Sridhar Reddy sensational comments on cm ys jagan

Kotamreddy Sridhar Reddy : ఏపీలో రాజకీయాలు మంచి జోరందుకుంటున్నాయి. ఇన్నాళ్ళూ అధికార – ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం చూశాం. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సొంత గూటి పక్షులే సీఎం జగన్ కి రివర్స్ అయ్యి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జగన్ కి కాంతి మీద ఆకునుకు లేకుండా చేస్తున్నాయి. ఇందుకు గాను క్రాస్ ఓటింగ్ చేసిన వైకప ఎమ్మెల్యే లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందుకు గాను సస్పెండ్ అయిన నేతలు జగన్ ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. తాజాగా ఇప్పుడు వైసీపీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి గట్టిగా మాట్లాడినప్పుడు.. దానిని వైసీపీ పెద్దలు రాజకీయ కోణంలో చూసి తనపై నిఘా పెట్టారని ఆరోపించారు. తనను అనుమానించిన చోట ఉండకూడదని భావించి వైసీపీకి దూరంగా జరిగాననని చెప్పారు. ఈ విషయాన్ని బహిరంగంగానే తెలియజేయడం జరిగిందని తెలిపారు. తాను పార్టీకి దూరంగా  జరిగినప్పుడు సస్పెండ్ చేయడయమనేది సమర్థనీయం అని చెప్పారు. అయితే సస్పెండ్ చేసిన విధానం సరైనది కాదని తెలిపారు. ఒక సభ్యుడిని సస్పెండ్ చేయాలంటే.. ముందు షోకాజ్ ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత  సస్పెండ్ చేయాలని కోటంరెడ్డి అన్నారు. ఈ మేరకు నిబంధనలు ఉన్నాయని చెప్పారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేసేందుకు వైసీపీ పార్టీకి ప్రత్యేకంగా ఏమైనా నిబంధనలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. అయితే సస్పెన్షన్‌తో తనకు వచ్చే నష్టమేమి లేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై మరింత గట్టిగా  మాట్లాడే అవకాశం తనకు వచ్చిందని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు డిస్మిస్ చేయడం పక్కా – కోటంరెడ్డి (Kotamreddy Sridhar Reddy)

వచ్చే ఎన్నికల్లో వైసీపీని రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా డిస్మిస్ చేస్తారని అన్నారు. వేరే పార్టీలో చేరే  అంశంపై స్పందించిన కోటంరెడ్డి.. రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన సమయంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కానీ, టీడీపీ కానీ.. తనను ఓటు అడగలేదన్నారు కోటంరెడ్డి. తాను ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేశానని చెప్పారు. టీడీపీకి ఓటు వేసింది తామేనంటూ వైసీపీ అధిష్టానం ఎలా నిర్థారణకు వచ్చిందని ప్రశ్నించారు.
YouTube video player
రహస్య ఓటింగ్ ద్వారా జరిగిన ఈ ఎన్నికల్లో తాము ఫలానా వారికి ఓటు వేశామంటూ పార్టీ ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. అలా ప్రకటించారంటే, వారికి ఓటింగ్ గురించి పూర్తి సమాచారం ఉండే ఉంటుందని, దీనిపై ఎన్నికల కమిషన్ సీరియస్ గా దృష్టి సారించాలన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. తాము ఎవరికి ఓటు వేశామో సజ్జలకు ఎలా తెలిసిందన్నారు, ఆయన విషయంలో ఈసీ విచారణ జరపాల్సిందేనన్నారు. టీడీపీ నుంచి తమకు 15 కోట్లనుంచి 20 కోట్ల రూపాయలు ముట్టాయని చెబుతున్న వైసీపీ అధిష్టానం దానికి రుజువులేమున్నాయని అడిగారు కోటంరెడ్డి. టీడీపీ టికెట్ పై గెలిచి వైసీపీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలకు సజ్జల ఎంతిచ్చారని ప్రశ్నించారు. పక్క పార్టీల నేతలు వైసీపీకి ఓటు వేస్తే అది నీతి అయినప్పుడు, వైసీపీ నేతలు పక్కపార్టీలకు ఓటు వేస్తే అవినీతి ఎలా అవుతుందని లాజిక్ తీశారు. వైసీపీ నుంచి జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలకు ఎంత ముట్టజెప్పారని సూటిగా ప్రశ్నించారు.
Exit mobile version
Skip to toolbar