Site icon Prime9

Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

Hyderabad: ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్‎ పోచారం శ్రీనివాసరెడ్డికి తన రాజీనామా లేఖను సమర్పించారు స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ సమర్పించారు. దీనికి ముందు అసెంబ్లీ రోడ్డులోని గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తన రాజీనామా లేఖను మీడియా సమక్షంలో అందరికి చూపించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు కోమటిరెడ్డి రాజగోపాల్‎రెడ్డి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. యుద్ధం నాకోసం కాదు. ప్రజల కోసమన్నారు. అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీనామ చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా అని వ్యాఖ్యానించారు. ప్రజల మీద నమ్మకంతో రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. ఉప ఎన్నిక వచ్చాక మునుగోడు గుర్తొచ్చిందని విమర్శించారు. తెలంగాణలో ప్రజా స్వామ్యం లేదని, మునుగోడు ప్రజలు మంచి తీర్పు ఇస్తారని భావిస్తున్నానని పేర్కొన్నారు.

Exit mobile version