Site icon Prime9

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి కియార అద్వానీ కొత్తలుక్‌ – అందంతో మ్యాజిక్‌ చేస్తున్న భామ

Game Changer New Poster Out: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌ విడుదలకు అంతా సిద్ధమైంది. ఈ టీజర్‌ లాంచ్‌కి ఇంకా ఒక్కరోజే ఉంది. నవంబర్ 9న సాయంత్రం 4:30 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి భారీగా ప్లాన్‌ చేసింది మూవీ టీం. దీంతో సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన గేమ్‌ ఛేంజర్‌ మేనియానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీజర్‌ రిలీజ్‌కు అలర్ట్‌ ఇస్తూ మూవీ టీం పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

ఇప్పటి వరకు రామ్‌ చరణ్‌కి సంబంధించిన లుక్‌నే రిలీజ్‌ చేసిన మేకర్స్‌ తాజాగా హీరోయిన్‌ కియార అద్వాని లుక్‌ని విడుదల చేశారు. స్కై బ్లూ కలర్‌ డ్రెస్‌లో కియార హోయలుపోతున్న ఈ లుక్‌ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె లుక్‌ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. కాగా డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న వరల్డ్‌ వైడ్‌గా విడుదల కాబోతోంది. మూవీ రిలీజ్‌కు ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్‌ షూరు చేసింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో పాటు అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌కి మెగా జాతర ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు.

టీజర్‌తోనే మూవీ ప్రమోషన్స్‌ ఎలా ఉండబోతున్నాయో చూపించబోతున్నారు మేకర్స్‌. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ఐఏఎస్‌ అధికారిగా కనిపించబోతున్నాడు. ఇందులో కియార అద్వానీ హీరోయిన్‌ కాగా.. హీరోయిన్‌ అంజలి కీలక పాత్ర పోషిస్తుంది. సునీల్‌, శ్రీకాంత్‌, నవీన్‌ చంద్ర, బాలీవుడ్‌ నటుడు హ్యారీ జోష్‌, ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాంలు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో ‘దిల్‌’ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాఉ. కార్తీక్‌ సుబ్బరాజు కథ అందిస్తుండగా.. సాయి మాధవ్‌ బుర్రా మాటలు సమకుర్చుతున్నారు. ఈ సినిమా ఎస్‌ఎస్‌ థమన్ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్‌ని అందిస్తున్నారు.

Exit mobile version