Keerthi Suresh : నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ” కీర్తి సురేష్ “ (Keerthi Suresh).
ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి.
నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్.
వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి.
దర్శకనిర్మాతలు ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకున్నారు.
కథల ఎంపిక విషయంలో పొరపాట్లు చేయడంతో కీర్తి నటించిన ఏ ఒక్క లేడీ ఓరియెంటెడ్ సినిమా సక్సెస్ కాలేదు.
‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ లాంటి సినిమాలు ఆమె ఇమేజ్ కి డ్యామేజ్ కలిగించాయి.
కాగా రీసెంట్ గా రజినీకాంత్ నటించిన ‘పెద్దన్న’ సినిమాలో రజినీకి చెల్లెలిగా కనిపించింది ఈ భామ.
ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చినా… హిట్ టాక్ ను సాధించలేకపోయింది.
ఆ తర్వాత వచ్చిన గుడ్ లక్ సఖి కూయ ప్రేక్షకులను నిరాశ పరిచింది.
ఇక భారీ ఆశలు పెట్టుకొని నటించిన మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
ఆ సినిమాపైనే ఆశలు..
అయితే ప్రస్తుతం ఏ అమ్మడు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
వాటిలో న్యాచురల్ స్టార్ నాని సరసన నటిస్తున్న “ధమాకా” ఒకటి కాగా.. మరొకటి చిరంజీవి నటిస్తున్న “భోళా శంకర్”.
ఈ చిత్రంలో మెగాస్టార్ కి చెల్లి క్యారెక్టర్లో కీర్తి నటిస్తుంది.
కాగా ఇటీవలే దసరా షూటింగ్ కి ప్యాకప్ చెప్పగా తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. కాగా ఈ ఫొటోల్లో కీర్తి సురేష్ (Keerthi Suresh) తో పాటు మరో నటి ప్రియాంక అరుల్ మోహన్ కూడా ఉండడం విశేషం. ఒక్కసారి అ అఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి…
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/