Trending News : మారుమూల గ్రామంలో జన్మించి.. ఫుట్‌బాల్ పై మక్కువతో పట్టుదలనే ఆయుధంగా చేసుకొని ఓ బాలిక పోరాడింది.
సాధారణంగా మన దేశంలో ఎక్కువ ఆదరణ క్రీడా ఏదైనా ఉంది అంటే క్రికెట్ అని నిర్మొహమాటంగా చెబుతారు.
ఇండియాలో క్రికెట్ కి ఉన్నంత ఆదరణ మరో క్రీడకి లేదు.
మన జాతీయ క్రీడ హాకీ.. మన నేలపై మొదలైన ఆట కబడ్డీ కానీ వాటికి క్రికెట్ కి ఉన్నంత డిమాండ్ లేదు.. ప్రోత్సాహం అందించే వారు కూడా తక్కువే.
ఇక వాటి పరిస్థితే అలా ఉన్నప్పుడు.. ఫుట్‌బాల్ కి మన దేశంలో ఆదరణ, ప్రోత్సాహం రెండు తక్కువే.
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఆదరణ పొందే ఆటలలో ఫుట్‌బాల్ ది ప్రధమ స్థానం.
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాళ్ల పేర్లు చెప్పమంటే రోనాల్డో, మెస్సీ అని చెబుతాం.
కానీ టాప్ 5 లో ఉన్న మన దేశ క్రీడాకారుడు సునీల్ చేత్రీ గురించి తెలిసింది తక్కువ మందికి.
అలాంటి పరిస్థితులు ఉన్న మన దేశంలో .. మన రాష్ట్రంలో నుంచి ఒక అమ్మాయి.. అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై శభాష్ అనిపించుకుంటుంది.
ఆడపిల్ల అనే కారణం, ఆర్ధిక పరిస్థితులు, వగైరా ఎన్నో కారణాల వల్ల మన దేశంలో ఇప్పుడిప్పుడే ఆడపిల్లలను కూడా ఆటలలో బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో అయితే చాలా అరుదుగా తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇలాంటి తరుణంలోనే.. ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కానపల్లి గ్రామానికి చెందిన వజ్జల శ్రీదేవి అనే క్రీడాకారిణి త్వరలో అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఈమె తల్లిదండ్రులు శ్రీనివాసులు, సుబ్బమ్మ. వీరు వ్యవసాయం చేస్తూ జీవనం సాటిస్తున్నారు.
కూతురికి చిన్నతనం నుంచి క్రీడలపై ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నాలుగో తరగతిలోనే కడపలోని వైయస్సార్ స్పోర్ట్స్ స్కూల్ లో చేర్పించారు. స్కూల్ తర్వాత నెల్లూరు షాప్ అకాడమీలో ఉంటూ శ్రీదేవి ఇంటర్ పూర్తి చేసింది. ప్రస్తుతం శ్రీదేవి డిగ్రీ చదువుతోంది. ఫుట్‌బాల్ అంటే చిన్నతనం నుంచి శ్రీదేవికి ఎంతో ఇష్టం. దీంతో శ్రీదేవి ఎన్నో పోటీల్లో పాల్గొనేది. విజేతగా నిలిచేది. అలా.. అరుణాచలంలో జరిగిన సీనియర్ క్యాంప్ లోనూ, కటక్ లో జరిగిన జూనియర్ క్యాంప్ లోనూ, గుంటూరులో జరిగిన ఎస్జిఎఫ్ పోటీల్లో పాల్గొని తన సత్తా చాటింది. బహుమతులు సాధించింది. మహారాష్ట్రలోని నాగపూర్ లోని స్లమ్స్ సాకర్ స్టేడియంలో ఈ నెల రెండవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు ఇండియా ఫుట్బాల్ జట్టుకు సంబంధించి ఎంపికలు జరిగాయి. ఇందులో మొత్తం 28 మందిని ఎంపికయ్యారు. వారిలో వజ్జల శ్రీదేవి మొదటి స్థానంలో నిలిచింది.
శ్రీదేవికి కోచ్ గా కె. సాయికిరణ్ వ్యవహరిస్తున్నారు. హోం లెస్ వరల్డ్ కప్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా.. హోమ్ లెస్ వరల్డ్ కప్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు. ఇది ఈ ఫౌండేషన్ నిర్వహించే వార్షిక అసోసియేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్. ఈ పోటీల్లో నిరాశ్రయులైన వ్యక్తుల జట్లు వివిధ దేశాల నుంచి పాల్గొంటాయి. 2023 ఏప్రిల్ లో ఈ టోర్నమెంట్లను నిర్వహించాలని నిర్ణయించారు. ఇది యూఎస్ఏ లోని కాలిఫోర్నియాలో జరగనున్నాయి. ప్రస్తుతం ఈ వార్తతో పలువురు ప్రముఖులు శ్రీదేవిని అభినందిస్తున్నారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/