Site icon Prime9

Kalvakuntla Kavitha: కేసీఆర్ పై గవర్నర్ వ్యాఖ్యలకు కల్వకుంట్ల కవిత కౌంటర్.. అందుకు ధన్యవాదాలంటూ ట్వీట్

kalvakutla kavitha

kalvakutla kavitha

Kalvakuntla Kavitha: తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళ సై కు మధ్య వైరం తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు.

ఈ క్రమంలో రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ పై విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ట్విటర్ వేదికగా స్పందించారు.

గవర్నర్ మాట్లాడిన వీడియో ను జత చేసిన కవిత ‘ కరోనా లాంటి అత్యంత క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే.. దేశ మౌళిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

కేవలం కొందరి సంపద పెంపు కోసం దృష్టి పెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాడుతున్నాం.

రిపబ్లిక్ డే లాంటి ప్రత్యేక రోజున సీఎం కేసీఆర్ గారు ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ మీరు అడిగినందుకు ధన్యవాదాలు’ అని కవిత ట్వీట్ చేశారు.

గవర్నర్ వ్యాఖ్యలపై కవిత ట్వీట్ తో కౌంటర్ ఇవ్వడం ఇపుడు వైరల్ గా మారింది.

రాజ్ భవన్ గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్ధాయిలో మండి పడ్డారు.

‘రాజ్యంగం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అభివ‌ృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుంది. తెలంగాణ అంటే నాకు ఇష్టం.

కొందరికి నేను నచ్చక పోవచ్చు. ఎంతకష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాను. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.

తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం. అభివృద్ధి అంటే కొత్త భవనాల నిర్మించడం కాదు.. అభివృద్ది అంటే జాతి నిర్మాణం.

కొందరికీ ఫార్మ్ హౌస్ కాదు.. అందరికీ ఫార్మ్ లు కావాలి. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. రోజుకూ 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది అన్నారు. మేధావులు మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారన్నారు.

రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందని గవర్నర్ తెలిపారు. తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందన్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version