Site icon Prime9

Jr.NTR Interval Scene RRR: ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన RRR సీన్

Tollywood: దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించినప్పటి నుండి, ఈ చిత్రానికి అంతర్జాతీయ ప్రేక్షకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది హాలీవుడ్ దర్శకులు, విమర్శకులు మరియు రచయితలు ఈ చిత్రాన్ని కొనియాడారు.

ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మాథ్యూ ఎ చెర్రీ ‘RRR’ని ఇతిహాసంగా రేట్ చేసాడు. RRR నుండి ఒక క్లిప్‌ను పోస్ట్ చేసి దానికి ఈ విధంగా క్యాప్షన్ ఇచ్చాడు. నేను 29 MCU సినిమాలు చూశాను. RRR లో ఈ ట్రక్/యానిమల్ షాట్ వంటి నమ్మశక్యం కాని షాట్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.

ఈ వీడియో ఒక రోజులో 10 మిలియన్ల వ్యూస్ దాటింది. ఇప్పుడు 12 మిలియన్ల వ్యూస్ సాధించింది. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ చిత్రానికి ఇప్పటికే సానుకూలంగా స్పందించారు.

Exit mobile version