Site icon Prime9

Devara OTT: అది ఎన్టీఆర్‌ క్రేజ్‌ – ఇంటర్నేషనల్‌కు పాకిన తారక్‌ స్టార్‌డమ్‌, విదేశీ భాషల్లోనూ ‘దేవర’ రిలీజ్‌!

Devara Streaming in Foreign Languages

NTR Devara Movie Streaming in Foreign Languages: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ విదేశి ఫ్యాన్స్‌కి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సర్‌ప్రైజ్‌ అందించింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం ‘దేవర’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీలోనూ దేవరకు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ఎన్టీఆర్‌ స్టార్‌డమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకు భారత్‌లోనే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

ఇంటర్నేషనల్ స్థాయిలో

ముఖ్యంగా జపాన్‌ ఆయన క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రిలీజ్‌ టైంలో చూశాం. అందుకే ఆయన సినిమాలు అక్కడ రిలీజ్‌, రీ రిలీజ్‌లు అవుతుంటాయి. ఒక్క జపాన్‌లోనే కాదు పలు దేశాల్లోనూ ఆయన మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది. విదేశియుల్లో కూడా ఎన్టీఆర్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశి అభిమానుల కోసం నెట్‌ఫ్లిక్స్ ఓ అనుహ్య నిర్ణయం తీసుకుంది. భారీ అంచనాల మధ్య దేవర గత సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్‌ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం థియేట్రికల్‌ రన్‌లో హిట్‌ అందుకుంది.

విదేశీ భాషల్లో ‘దేవర’

రోజురోజుకు ఆడియన్స్‌ పెరగడంతో కలెక్షన్స్‌ కూడా బాగానే పెరిగాయి. మొత్తం థియేట్రికల్‌ రన్‌లో దేవర రూ. 500 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. థియేట్రికల్‌ రన్‌ పూర్తి చేసుకున్న దేవర పార్ట్‌ (Devara Part 1 OTT) నవంబర్‌ 8న ఓటీటీలో విడుదలైంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చిన దేవర మరికోద్ది రోజుల్లో హిందీలో భాషలో స్ట్రీమింగ్‌ రానుంది. ఇక ఓటీటీలో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ చూసి ఇంటర్నేషనల్‌ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ విదేశీ భాషల్లోనూ దేవరను రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకుంది. ఇంగ్లీష్‌తో పాటు కొరియన్‌, స్పానిస్‌, బ్రెజిలియన్‌ ఈ నాలుగు విదేశీ భాషల్లో కూడా దేవరను సడెన్‌గా స్ట్రీమింగ్‌ ఇచ్చేసింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎన్టీఆర్‌ క్రేజ్‌ ఇంటర్నేషనల్‌ స్థాయికి చేరుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నటనకు హాలీవుడ్‌ దర్శక దిగ్గజాలు సైతం ఫిదా అయ్యారు. ముఖ్యంగా పులిని కాపాడే సీన్‌లో ఎన్టీఆర్‌ ఎక్స్‌ప్రెషన్‌, కటౌట్‌పై ప్రశంసలు వచ్చాయి. ఆ సీన్‌లో అతడు తప్ప మరెవరిని ఊహించుకోలేము అనేంతగా తన పర్పార్మ్‌ చేశాడంటూ హాలీవుడ్‌ దర్శక-నిర్మాతలు కొనియాడారు. దీంతో ఎన్టీఆర్‌కు విదేశీయులు కూడా నీరాజనాలు పలికారు. ఈ చిత్రంతో విదేశాల్లోనూ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఎన్టీఆర్‌ ‘దేవర’ చూసేందుకు ఫారిన్‌ ఆడియన్స్‌ కూడా ఆసక్తి చూపుతున్నారు. నేషనల్‌ వైడ్‌గా డూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచిన దేవర విదేశి భాషల్లో ఏలాంటి రెస్సాన్స్‌ అందుకుంటుందో చూడాలి.

Exit mobile version