Site icon Prime9

Jogi Ramesh : చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవాల్సిందే…

jogi ramesh sensational comments on chandrababu naidu

jogi ramesh sensational comments on chandrababu naidu

Jogi Ramesh : ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగే పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మరో సారి హాట్ కామెంట్స్ చేశారు. కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలకి కౌంటర్ గా ఆయన పలు విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అనే శవాన్ని తీసుకెళ్లి పూడ్చిపెట్టబోతున్నారు, కుప్పంలో చంద్రబాబుతో సహా ఓడిపోబోతున్నారు అని జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీకి 175 నియోజకవర్గాల్లో నిలబడటానికి అభ్యర్థులే లేరు అని పోయి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని పొత్తు పెట్టుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని జోగి రమేష్ అన్నారు.

రాబోయే ఎన్నికలకి చంద్రబాబు వెళ్ళి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవాల్సిందే అని ఆయన అన్నారు. అసలు చంద్రబాబు జీ.వో. నం1 చదివి ఉండడని, చదివితే ఆయన అలా మాట్లాడి ఉండరని ఆయన అన్నారు. బొక్కల్లో తప్పా మీటింగ్ పెట్టుకోడానికి ఆయనకి చోటు దొరకలేదా అని ప్రశ్నించారు.

తెలుగుదేశంలో నాయకులు నిర్వహించే సభలని ప్రభుత్వం ఎప్పుడూ కట్టడి చెయ్యలేదు అని చంద్రబాబుని కట్టడి చెయ్యడానికి కారణం ఇరుకు బొక్కల్లో, రహదారుల్లో చంద్రబాబు సభలు పెట్టడమే అని ఆయన చెప్పారు. అసలు చంద్రబాబు 14 సంవత్సరాల తన పాలనలో ఏం చేసాడని ప్రజలు చంద్రబాబు మీటింగ్ కి వస్తారు అని ప్రశ్నించారు.

Exit mobile version