Site icon Prime9

Janhvi Kapoor : బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుమలలో స్వామి వారిని దర్శించుకున్న జాన్వీ కపూర్..

janhvi kapoor visted tirumala with her boy friend

janhvi kapoor visted tirumala with her boy friend

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. మొదటి సినిమా ‘ధడక్’ సూపర్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. బాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటూ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటున్న ఈ అమ్మడు సౌత్‌పై కూడా ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. పూజా కార్యక్రమం రోజు టాలీవుడ్ నుంచి అతిరధ మహారధులు అంతా వచ్చి పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ ఫొటోల్లో ఎన్టీఆర్ – జాన్వీ లను చూసి సీనియర్ ఎన్టీఆర్ – శ్రీదేవి ఫోటోలతో కలిపి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ క్రియేట్ చేశారు.

కాగా ఒక వైపు సినిమాల‌తో సంద‌డి చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది జాన్వీ. నెట్టింట తన హాట్ ఫోటోలతో అభిమానుల్ని ఓ రేంజ్ లో ఆకర్షిస్తుందని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎప్పటికప్పుడు తన హాట్‌ హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని అభిమానులతో షేర్‌ చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. అయితే గత కొంతకాలంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ రిలేషన్ లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటివలే నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ క్లబ్ ఓపెనింగ్ సమయంలో కూడా జాన్వీ కపూర్, శిఖర్ పహారియా కలిసి కనిపించారు. ముంబైలో రెండు రోజుల క్రితమే కనిపించి బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయిన ఈ జంట, ఇప్పుడు తిరుమలలో కలిపించి మరోసారి తమ రిలేషన్షిప్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేశారు.

శిఖర్ పహరియాతో తిరుమల వచ్చిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor)..

జాన్వీ కపూర్ తిరుమల ఎక్కువగా వస్తూ ఉంటుందని అందరికీ తెలిసిందే. తాజాగా తన ప్రియుడితో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకుంది ఈ భామ. ఈ నేపధ్యంలో ఈ ఇద్దరూ కలిసి తిరుమలలో కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. పింక్ లేహంగాలో ట్రెడిషనల్ డ్రెస్ లో జాన్వీ కపూర్ చాలా అందంగా కనిపించగా.. శిఖర్ పహారియా కూడా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించాడు. ప్రస్తుతం వీరిద్దరూ తిరుమల స్వామి వారి సన్నిధిలో ఉన్న దృశ్యాలు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి.

 

అయితే ఇప్పటి వరకు జాన్వీ కపూర్, శిఖర్ పహారియాలు తమ రిలేషన్ పై ఓపెన్ అవ్వకపోవడం గమనార్హం. మరి ఈ ఇద్దరూ స్నేహితులు మాత్రమేనా? లేక పెళ్లి వరకూ వెళ్లే ప్రేమ జంటనా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు టాలీవుడ్ లో విజయ్ దేవరకొండపై తనకు క్రష్ ఉందని పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. మొత్తానికి అయితే అతిలోక సుందరి ముద్దుల కుమార్తె మరి పెళ్లి భజలు ఎప్పుడు మోగిస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version