Perni Nani: శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభలో ఏపీ ప్రభుత్వ చేస్తున్న అరాచక పాలనపై జనసేన అధినేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని పలు సమస్యలపై యువశక్తి వేదిగా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై దాడికి దిగారు. మాజీ మంత్రి పేర్ని నాని పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. నేను మీ అన్నతోనే సెల్ఫీ దిగలేదు.. నువ్వెంత నీ సెల్పీ కోసం కూడా ఎదురుచూడాలా అంటూ పవన్ కు రీ కౌంటర్లు వేశారు.
నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావ్..
‘పవన్ కళ్యాణ్ నీ వ్యక్తిత్వం ఏంటంటే.. సినిమాల్లో లాగా సినిమా భాషనే తెలిసిన వ్యక్తివి. నీది దిగజారుడు వ్యక్తిత్వం.. మైక్ ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావ్. 3 వేల మంది ముందు ఉంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాతావా? సీఎం జగన్ ను , వైసీపీ మంత్రులను తిట్టడం తప్ప ఆ సభలో ఏం జరిగింది. జనసేన కార్యకర్తలకు ఏం చెప్పావ్.. సినిమా మీద పిచ్చితో నీ సభకు వచ్చారు కానీ నువ్వు ఏదో చేస్తావని కాదు. నిన్న నమ్మి వచ్చిన వ్యక్తులను కూడా నువ్వు వదలలేదు. వాళ్లను నమ్మను అంటున్నావు.
సీఎం జగన్ అంటే ఎందుకు అంత ద్వేషం, అసూయ.. ఆయన్నుమూడు ముక్కల ముఖ్యమంత్రి అని విమర్శిస్తున్నావు. అసలు మూడు ముక్కల రాజకీయ నాయకుడివి నీవే.. సినిమా కవులు రాసిన స్కిఫ్ట్ చదువుతావు. ఓ వైపు బీజేపీతో పొత్తులోఉంటావ్..మరో వైపు టీడీపీతో రాజకీయం చేస్తావు. దేశంతో బరితెగింపు రాజకీయాలు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే. 2014 నుంచి 2019 వరకు ఏం చేశావ్. పూటకో మాట.. రోజుకో మాట మాట్లాడుతున్నావ్..’ అంటూ వ్యాఖ్యానించారు.
కిక్కిరిసిన ప్రాంగణం
కాగా, రణస్థలి లో జరిగిన జనసేన యువశక్తి సభ విజయవంతం అయింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున యువత తరలివచ్చారు. దాదాపు లక్ష మందికి పైగా హాజరై ఉంటారని అంచనా. మహిళలు, యువతులు భారీగా వచ్చారు. భారీగా తరలివచ్చిన జనాలతో యువశక్తి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భోజనాలు ఏర్పాటు చేశారు
ఇవీ చదవండి:
నన్ను చంపేస్తారు.. సుపారీ కూడా ఇచ్చారు- పవన్ కళ్యాణ్
ఛీఛీ నా బతుకుచెడా.. మీకోసం డైమండ్ రాణి రోజా విమర్శలు కూడా పడుతున్నా- పవన్ కళ్యాణ్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/