Site icon Prime9

Mekathoti sucharitha: పవన్ కళ్యాణ్ అభిమానులు సైకోలా.. మేకతోటి సుచరిత కామెంట్స్

Mekathoti sucharitha

Mekathoti sucharitha

Mekathoti sucharitha: శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి (Janasena Yuvashakthi) సభలో ఏపీ ప్రభుత్వ చేస్తున్న అరాచక పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని పలు సమస్యలపై యువశక్తి వేదిగా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలందిరినీ హింసించే పాలకుడిని ఎదుర్కోనేందుకు జనసైనికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర వెనకబాటుతనంపై యువత ఎదుకుతిరగాలని.. వైసీపీ నేతలను నిలదీయాలని పవన్ అన్నారు. ‘ఇది కళింగాధ్ర కాదు..కలబడే ఆంధ్ర.. తిరగబడే ఆంధ్ర..’అంటూ యువతలో ఉత్తేజం నింపారు. జనసేన అధికారంలోని వస్తే ప్రజలకు ఎలాంటి పథకాలు ప్రవేశపెడతారో పవన్ వివరించారు.

యువతకు ఇచ్చిన సందేశం ఇదేనా..

అయితే పవన్ కళ్యాణ్ సభావేదికగా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై దాడికి దిగారు. మాజీ మంత్రి మేకతోటి సుచరిత పవన్ పై విమర్శలతో దాడికి దిగారు. ‘నోటికొచ్చినట్టు తిట్టండి, కొట్టండి..ఇదేనా పవన్ కళ్యాణ్ యువతకు ఇచ్చిన సందేశం. థియేటర్లలో, మాల్స్ లో పవన్ సైకో అభిమానుల అరాచకాలకు అంతుండటం లేదు. పవిత్రమైన వివేకానంద జయంతి రోజు యువతను ఇలా రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటు.. ’అని పవన్ పై, జనసేన కార్యకర్తలపై మాటలతో దాడికి దిగారు.

జనసంద్రమైన రణస్థలి

కాగా, రణస్థలి లో జరిగిన జనసేన యువశక్తి (Janasena Yuvashakthi) సభ విజయవంతం అయింది. జిల్లాలోని లావేరు మండలం తాళ్లవలస పంచాయితీ పరిధిలో 35 ఎకరాల స్ధలంలో ఈ సభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున యువత తరలివచ్చారు. దాదాపు లక్ష మందికి పైగా హాజరై ఉంటారని అంచనా. మహిళలు, యువతులు భారీగా వచ్చారు. భారీగా తరలివచ్చిన జనాలతో యువశక్తి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భోజనాలు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి: 

పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి పేర్ని నాని

 బిడ్డ చనిపోయాడు న్యాయం చేయమంటే మూడు బస్తాల బియ్యం ఇస్తానంటావా? నువ్వేం మంత్రివి? మంత్రి ధర్మానపై పవన్ కళ్యాణ్ ఫైర్

 దేశంలో పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు ఎవరు?- పవన్ కళ్యాణ్

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version