Site icon Prime9

JanaSena: నేడు మంగళగిరిలో జనసేన పీఏసీ సమావేశం

Mangalagiri: నేడు మంగళగిరిలో జనసేన పార్టీ పీఏసీ సమావేశం జరుగనుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షత జరిగే సమావేశంలో జనసేన పార్టీ చేపట్టిన జనవాణి, కౌలు రైతు భరోసా యాత్ర, రోడ్ల దుస్థితిపై చేపట్టిన డిజిటల్ ప్రచారం పై సమీక్ష చేయనున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, గోదావరి వరదలు కారణంగా నష్టపోయిన రైతాంగం, పరిహారం అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై చర్చించనున్నారు. రాబోయే మూడు నెలల కాలంలో పార్టీ పరంగా చేపట్టబోయే కార్యక్రమాలు, అక్టోబర్ 5న ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటన విధివిధానాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు పాల్గొననున్నారు.


Exit mobile version