Janasena Leader Warns Pushp 2 Release Stop in AP: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘పుష్ప 2: ది రూల్’ రిలీజ్ సందడి కొనసాగుతుంది. ఎక్కడ చూసిన పుష్ప పుష్ప అంటూ మూవీ జపం చేస్తున్నారు. టికెట్స్ కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే పలు థియేటర్లో హౌజ్‌ఫుల్ కనిపిస్తున్నాయి. మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి పుష్ప 2 టీం ఆనందంలో ఉంది. ఓవైపు మూవీ రిలీజ్ సందడి కొనసాగుతుంటే.. మరోవైపు అల్లు అర్జున్‌కి హెచ్చరికలు వస్తున్నాయి. ఏపీ పుష్ప 2 రిలీజ్ ప్రభావం ఎలా ఉండనుందా? అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఏపీ పుష్ప 2 పరిస్థితి ఎంటా మూవీ టీం నుంచి అభిమానుల వరకు అంతా ఆందోళనలో ఉన్నారు.
ఈ క్రమంలో మూవీ రిలీజ్‌కు ఎలాంటి అడ్డంకులు రాకపోవడంతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. అంతా బాగుందని అనుకుంటున్న టైంలో పుష్ప 2కి వరుస అడ్డంకులు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సినిమాను నిలిపివేయాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఏపీలో పుష్ప 2 రిలీజ్ చిక్కుల్లో పడేలా కనిపిస్తోంది. పుష్ప 2ని ఏపీ అడ్డుకుంటాయమంటూ తాజాగా ఓ జనసేన నేత వార్నింగ్ ఇచ్చారు. దీనికి కారణం అల్లు అర్జున్ తీరు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అసలు మెగా ఫ్యామిలీ ప్రస్తావన తీయకపోవడాన్ని జనసేన నేతలు, మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే ఏపీలో పుష్ప 2 రిలీజ్‌ను అడ్డుకుంటామంటూ గన్నవరం నియోజకవర్గంకు చెందిన జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు అల్టిమేటం జారీ చేశారు.
అల్లు అర్జున్ పోకడ బాగా లేదని, ఆయన తీరు మెగా ఫ్యామిలీ అభిమానులు, జనసేన నేతలను ఆగ్రహానికి గురి చేస్తుందన్నారు. మెగా ఫ్యామిలీ యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు అభిమానిస్తారు. కానీ నువ్వు మాత్రం వారికి వ్యతిరేకంగా వెళుతున్నావు. ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ప్రచారం చేశావు. రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాంటి ఆయనను నువ్వు గుర్తించకుండ వైసీపీ నేతకు సపోర్టు ఇస్తూ ఎన్నికల ప్రచారం చేశావ్. మెగా ఫ్యామిలీ విషయంలో అల్లు అర్జున్ అహంతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైన తన తీరు మార్చుకుని చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు గార్లకి క్షమాపణలు చెప్పాలి. ఎప్పుడు చిరంజీవి గారి అభిమానిని, మెగా ఫ్యామిలీ నీడలో పెరిగాను, చిరంజీవి గారి అడుగుజాడల్లో నడుస్తానని చెప్పి.. ఇప్పుడు కనీసం వారి ప్రస్తావన తీసురాకపోవడం కరెక్ట్ కదు.
నువ్వు చిరంజీవి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోవాలి. ఇకనైనా అహం వీడి వెనక్కి మెగా ఫ్యామిలీని క్షమాపణలు అడుగు. లేదంటూ పుష్ప 2 రిలీజ్‌ను అడ్డుకుంటాం” ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం జనసేన నేత కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. మెగా-అల్లు ఫ్యాన్స్ మధ్య వివాదంకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అల్లు అర్జున్ ఉద్దేశిస్తూ వివాదస్పద పోస్ట్ చేసింది. “అల్లు అర్జున్ గారు మీరు నంద్యాలలో చేసిన ప్రచారం ఇక్కడ ప్రజలు ఇప్పటికీ మరువలేనిది. మీరు నంద్యాల సందర్శించినప్పుడు మీ సెంటిమెంటట్ మాకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఆ సెంట్‌మెంట్ మాదిరిగానే మీ పుష్ప 2 కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నామంటూ” వ్యంగ్యంగా తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఆమె పోస్ట్‌పై బన్నీ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ఆమె ఆ ట్వీట్ డిలిట్ చేసింది.