Site icon Prime9

Pawan Kalyan : సీఎం వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు

janasena chief pawan kalyan comments on cm ys jagan

janasena chief pawan kalyan comments on cm ys jagan

Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. నిజాంపట్నంలో సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు బదులుగా పవన్ కళ్యాణ్ ‘పాపం పసివాడు’ సినిమా పోస్టర్‌ను పోస్ట్ చేస్తూ.. తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.

ఏపీ సీఎంతో.. పాపం పసివాడు సినిమా – పవన్ (Pawan Kalyan)

‘మన ఏపీ సీఎంతో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన చాలా అమాయకుడు.. అయితే ఇక్కడ ఓ చిన్న మార్పు అవసరం ఉంది.. ఆయన చేతిలో ఒక్క సూట్‌కేస్ బదులుగా.. అక్రమ సంపాదన కోసం మనీ లాండరింగ్‌ని ఈజీగా చేసే సూట్‌కేస్ కంపెనీలు ఉంచాలి. ప్రియమైన ఏపీ సీఎం.. మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి కాదు. అక్రమంగా సంపాదించిన మీకు క్లాస్ వార్ అనే పదాన్ని ఉచ్చరించే హక్కు లేదు. రాయలసీమ మీ నుంచి, మీ గ్రూప్ నుంచి ఏదో ఒకరోజు విముక్తి పొందుతుందని ఆశిస్తున్నాను. అక్కడ పాపం పసివాడు సినిమా స్టోరీకి రాజస్థాన్ ఎడారిలో ఇసుక దిబ్బలు కావాలి.. కానీ ఏపీలో మాత్రం వైఎస్సార్‌సీపీ నదుల నుంచి ఇసుకను దోచేస్తోంది. ఇక్కడ కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయి. చీర్స్’ అంటూ జనసేనాని ట్వీట్ చేశారు.

 

కాగా మే 16 వ తేదీన బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మత్స్యకార భరోసా నిధుల్ని సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ మేరకు అక్కడ నిర్వహించిన సభలో జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. టీడీపీ వెంటిలేటర్‌పై ఉందని.. అందుకే చంద్రబాబు దత్తపుత్రుడుని నమ్ముకున్నారన్నారు. రెండు చోట్ల పోటీ చేస్తే ఎమ్మెల్యేగా పనికిరారని ప్రజలు ఓడించారని.. రాజకీయ పార్టీ పెట్టి 10 ఏళ్లైనా 175 చోట్ల అభ్యర్థులను పెట్టలేరని విమర్శించారు. దత్తపుత్రుడు సీఎం పదవి వద్దు.. దోపిడీలో వాటా చాలని అంటున్నారన్నారు. బాబుకు మంచి చేయడానికి దత్త పుత్రుడు చూస్తారని.. ఆయన ఏ పార్టీతో కలవాలో చంద్రబాబే చెబుతారన్నారు. బీజేపీ పక్కన చేరతారు.. చంద్రబాబు విడాకులు ఇవ్వమంటే ఇచ్చేస్తారు.. షూటింగ్‌లకు విరామం ఉన్నప్పుడే బయటకు వస్తాడంటూ జగన్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గాజువాక రానంటారని.. ఇటు దత్తపుత్రుడు మంగళగిరిలో పోటీ పెట్టకుండా ఆగుతారన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం దత్త పుత్రుడు ఏం చేయటానికైనా రెడీ అని.. పార్టీని హోల్‌సేల్‌గా అమ్మేసిన ప్యాకేజ్ స్టార్ పవన్ అని సీఎం జగన్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version